Chandrababu Cases Updates : రాజకీయ కక్షతోనే వరుస కేసులు- మద్యం కేసులో చంద్రబాబు తరపు లాయర్ వాదనలు

Chandrababu Bail : ఇది చంద్రబాబు వ్యక్తిగత నిర్ణయం కాదు. అప్పటి రెవిన్యూ స్పెషల్ సీఎస్ పరిశీలించి సంతకాలు చేశారు.

Chandrababu Cases Updates : రాజకీయ కక్షతోనే వరుస కేసులు- మద్యం కేసులో చంద్రబాబు తరపు లాయర్ వాదనలు

Chandrababu Liquor Case (Photo : Google)

మద్యం పాలసీ కేసులో చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. సీఐడీ తరపున ఏజీ శ్రీరాం, చంద్రబాబు తరపున అడ్వొకేట్ నాగముత్తు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే చంద్రబాబు తరపు లాయర్లు తమ వాదనలు వినిపించారు. చంద్రబాబు విచారణకు సహకరిస్తారని, బెయిల్ ఇవ్వాలని కోర్టుకి విజ్ఞప్తి చేశారు.

సీఐడీ తరపున ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. అధికార దుర్వినియోగం జరిగిందన్నారు. నిన్నటి వాదనలకు కొనసాగింపుగా నేడు మరోసారి వాదనలు వినిపించారు ఏజీ శ్రీరాం. కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని, ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. అయితే, కస్టోడియాల్ విచారణ చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు తరపు అడ్వొకేట్ నాగముత్తు చెప్పారు. పాలసీ మేటర్స్ మీదే 7 కేసులు నమోదు చేశారని, రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై వరుస కేసులు పెడుతున్నారని వాదించారు. చంద్రబాబు విచారణకు సహకరిస్తారని, మెడికల్ గ్రౌండ్స్ పరిగణలోకి తీసుకోవాలని, ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Also Read : నన్ను మిత్రుడిగానే చూడండి .. శత్రువుగా చూస్తే తట్టుకోలేరు : పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

”ఎక్సైజ్ శాఖ కమిషనర్ పరిశీలించి ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. మంత్రి మండలి ఆమోదించింది. క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా ఎక్సైజ్ కమిషనర్ ఫైల్ పెట్టారు. అప్పటి రెవిన్యూ స్పెషల్ సీఎస్ పరిశీలించి సంతకాలు చేశారు. ఇది చంద్రబాబు వ్యక్తిగత నిర్ణయం కాదు” అని చంద్రబాబు తరపు లాయర్ నాగముత్తు అన్నారు.

కాగా, ఆర్థిక నేరాల్లో యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు పలు కేసుల్లో పేర్కొందని ఏజీ శ్రీరాం గుర్తు చేశారు. తనకు కావాల్సిన వారికి లబ్ది చేకూర్చేలా ప్రివిలేజ్ ఫీజు తొలగించారని, ఎలాంటి ప్రాపర్ స్టడీ చెయ్యకుండా పాలసీ చేశారని, రాష్ట్ర ఖజనాకు భారీగా నష్టం వచ్చిందని, క్విడ్ ప్రో కో జరిగిందని, పొలిటికల్ బెనిఫిట్స్ కోసం మార్పులు చేశారని ఏజీ వాదనలు వినిపించారు.

Also Read : అమరావతి పేరుతో వేల కోట్లు సంపాదించిందెవరు? : మంత్రి బుగ్గన

అటు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరపున అడ్వొకేట్ వాదనలు పూర్తయ్యాయి. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు. రేపు సీఐడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.
సిఐడి తరపు న్యాయవాదులు