Thirumala : తిరుమలలో అన్యమత గుర్తుల కలకలం
ద్విచక్ర వాహనాలకు అన్యమత గుర్తులు ఉన్నట్లు స్థానికులు గర్తించారు. జీఎమ్ సీ టోల్ గేట్ దగ్గర విజిలెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వెంటనే ద్విచక్రవాహనాలను ట్రేస్ చేసి పట్టుకున్నారు.

Tirumala (1) 11zon
pagan symbols in Thirumala : తిరుపతిలో అన్యమత ప్రచారం తీవ్ర కలకలం సృష్టింస్తోంది. తిరుమలలో అన్యమత గుర్తులు కలకలం రేపాయి. ద్విచక్ర వాహనాలకు అన్యమత గుర్తులు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. GMC టోల్ గేట్ దగ్గర విజిలెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ద్విచక్రవాహనాలను ట్రేస్ చేసి ఎస్పీఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు.
గతంలోనూ తిరుమలలో అన్యమత ప్రచారం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. గతేడాది జనవరి నెలలో తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏసుక్రీస్తు సిలువ గుర్తుల కలకలం సృష్టించాయి. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ లో ఉన్న చెట్లకు శిలువ గుర్తులు కలకలం రేపాయి. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే స్విమ్స్ ఆస్పత్రి ఆవరణలో ఉన్న 4, 5 చెట్లపై శిలువ గుర్తులు ప్రత్యక్షమయ్యాయి.
Omicron : పండగలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్…ప్రపంచవ్యాప్తంగా 5,700లకు పైగా ఫ్లైట్స్ రద్దు
ఆ శిలువ గుర్తులను చూసిన రోగులు ఆస్పత్రి వర్గాలకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చెట్లకు వేసి ఉన్న శిలువ గుర్తులను గమనించిన హాస్పిటల్ సిబ్బంది వాటిని చెరిపివేశారు. గత కొంతకాలంగా టీటీడీలో అన్యమత ప్రచారం జరుగుతోందన్న విమర్శలు వస్తున్న క్రమంలో మరోసారి ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.