కన్నవారే కూతుళ్లను కిరాతకంగా చంపడానికి కారణమిదే, మదనపల్లె జంట హత్యల కేసులో నమ్మలేని నిజాలు

madanapalle double murder case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన చిత్తూరు జిల్లా మదనపల్లె కన్న కూతుళ్ల(అలేఖ్య, దివ్య) హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మూఢ భక్తితో ఇద్దరు కూతుళ్లను డంబెల్‌తో కొట్టి అతి దారుణంగా చంపేసిన తల్లి పద్మజ ఆ తర్వాత పెద్ద కుమార్తె అలేఖ్య (27) నాలుకను కోసి తినేసింది. ఈ విషయాన్ని పద్మజ భర్త పురుషోత్తం నాయుడు డాక్టర్లకు చెప్పినట్టు తెలుస్తోంది.
పద్మజ చాలా వింతగా ప్రవర్తిస్తోందని డాక్టర్లు తెలిపారు. ఆమె మాటలు, చేష్టలు చూసి షాక్ అవుతున్నారు. నేను మూడోకన్ను తెరిస్తే భస్మమవుతారని వైద్య పరీక్షలకు వచ్చిన పద్మజ రుయా డాక్టర్లను బెదిరించారు. దీంతో డాక్టర్లు అయోమయానికి లోనయ్యారు.
జంట హత్యల కేసు నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజను భారీ బందోబస్తు నడుమ శుక్రవారం(జనవరి 29,2021) రుయాకు తీసుకొచ్చా రు. వీరిని పరీక్షించిన డాక్టర్లు అధునాత పరీక్షలు, మరింత కౌన్సెలింగ్ కోసం విశాఖ మానసిక ఆసుపత్రికి రెఫర్ చేశారు. కాగా, వారి ఆర్థిక స్థితిగతులను చూసి కొందరు వారిపై కన్నేసి ఉండొచ్చన్న అనుమానాలతో హైకోర్టు అడ్వకేట్ రజినీ నిందితులను విచారించేందుకు సిద్ధమయ్యారు.
పద్మజ, పురుషోత్తం మానసిక సమస్యలతో బాధపడుతున్నారని రుయా మానసిక వైద్యనిపుణులు తేల్చారు. వీరికి సుమారు నాలుగు గంటల పాటు కౌన్సెలింగ్ ఇచ్చారు. వైద్య పరీక్షలు చేశారు. తాము అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పారని, విపరీతమైన దైవ చింతనతోనే వారు ఈ సమస్య బారినపడ్డారని డాక్టర్లు తెలిపారు. స్కిజోఫ్రేనియా, మేనియా తదితర మానసిక సమస్యల లక్షణాలు వీరిలో ఉన్నాయన్నారు. వారిద్దరికి మరింత కౌన్సిలింగ్ అవసరం అని డాక్టర్లు వెల్లడించారు.
రుయా మానసిక వైద్య విభాగాధిపతి డాక్టర్ నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితులు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. విపరీతమైన దైవ చింతనతోనే వారు ఈ సమస్య బారినపడ్డారన్నారు. స్కిజోఫ్రేనియా, మేనియా తదితర మానసిక సమస్యల్లో ఉండే లక్షణాలు వీరిలో ఉన్నాయన్నారు. పద్మజ తండ్రి, మేనత్తలు సైతం మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. రుయాలో కస్టోడియల్ కేర్ లేకపోవడంతో వీరిని విశాఖకు రెఫర్ చేసినట్లు వివరించారు.
అలేఖ్య, సాయి దివ్య ఇద్దరూ తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తం నాయుడు చేతిలో దారుణ హత్యకు గురవడం కలకలం రేపుతోంది. ఈ కేసును తవ్వేకొద్దీ ఆసక్తికర కోణాలు వెలుగుచూస్తున్నా యి. తల్లిదండ్రులు ఉన్నత విద్యావంతులు. అలాంటి వ్యక్తులు ఇలా మారడం అందరిని విస్మయానికి గురి చేస్తోంది. చిత్తూరుకు చెందిన పద్మజ చాలా ఏళ్ల క్రితమే మదనపల్లెలో స్థిరపడ్డారు. ఆమె తల్లి చిత్తూరులోని ఎస్‌బీఐ కాలనీలో నివాసముంటున్నారు. హత్యకు గురైన అలేఖ్య, సాయిదివ్య తరచూ అమ్మమ్మ ఇంటికి వచ్చేవారు. పద్మజ తల్లి ఇంట్లో తరచూ ఏవో పూజలు చేస్తుండేవారని తెలుస్తోంది. ఈమె దగ్గర కాలనీ వాసులు మంత్రాలు కూడా వేసుకున్నట్టు సమాచారం. అర్ధరాత్రిళ్లు ఇంట్లో నుంచి పొగలు రావడం చూశామని స్థానికులు చెబుతున్నారు. పలు మార్లు అలేఖ్య, సాయిదివ్య కూడా ఇక్కడ పూజలు చేశారని తెలిపారు. క్షుద్రపూజల పేరిట మోసాలకు పాల్పడేవారు తమిళనాడు నుంచి చిత్తూరుకు వస్తుంటారు. ఈ తరుణంలో పూజలు చేసిన వ్యక్తి చిత్తూరు మీదుగా మదనపల్లెకు వెళ్లి ఉండొచ్చనే అనుమానం తలెత్తుతోంది.