అక్రమ సంబంధం…భర్త హత్య, భార్య ఆత్మహత్య, ప్రియుడు జైలుకు

అక్రమ సంబంధం…భర్త హత్య, భార్య ఆత్మహత్య, ప్రియుడు జైలుకు

man arrested for murder case due to illegal affair, in east godavari district : వివాహేతర సంబంధం ఒకరిని హత్యచేస్తే మరోకరు ఆత్మహత్య చేసుకున్నారు.మరోకరు జైలుపాలయ్యారు ఫలితంగా రెండుకుటుంబాలు వీధిన పడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం లో ఫిబ్రవరి 8వ తేదీన హత్యకేసు మిస్టరీని పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధమే హత్యకు, ఆత్మహత్యకు కారణమని తేలింది.

స్ధానిక కోటవారి వీధిలో నివసించే రెడ్డెం శ్రీనివాస్ తన రెండో భార్య స్వరూపరాణి, ముగ్గురు పిల్లలతో కలిసి కాపురం చేస్తున్నాడు. గతేడాది అదే వీధిలో ఇంటినిర్మాణ పని కోసం వచ్చన కోరుకొండ మండలం కనుపూరుకు చెందిన రెడ్డి వీరబాబుతో స్వరూపరాణికి పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయంతో వారిద్దరూ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఇద్దరూ రోజు అర్ధరాత్రి సమయంలో స్వరూపరాణి ఇంట్లో కలుసుకునే వాళ్లు. ఈ సంగతి కొన్నాళ్లకు శ్రీనివాస్ కు తెలిసి పోయింది. దీంతో అతను భార్య స్వరూపరాణిని మందలించాడు. అయినా ఆమె తన ప్రవర్తన మార్చుకోలేదు. వీరబాబుతో కలుస్తూనే ఉంది. భర్త శ్రీనివాసరావు పలు మార్లు మందలించటంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని చూసింది.

ఈ విషయం ప్రియుడు వీరారెడ్డికి చెప్పింది. ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారు. భర్తను హత్య చేయటానికి ప్రిపేర్ అయ్యారు. వీరబాబు ఫిబ్రవరి 7వ తేదీ రాత్రి కనుపూరు నుంచి వచ్చేప్పుడు తన మోటారు సైకిల్ పై బలమైన చెక్కను తీసుకు వచ్చాడు. స్వరూపరాణి ఆదేశాల మేరకు రాత్రి గం. 11-30 సమయంలో వాళ్లింట్లోకి వెళ్లాడు. ఒకగదిలో మడతమంచంపై నిద్రిస్తున్న స్వరూపరాణి భర్త శ్రీనివాసరావు తలపై తనతో తెచ్చుకున్నబలమైన చెక్కతో కొట్టాడు. దీంతో శ్రీనివాసరావు అపస్మారక స్ధితిలోకి వెళ్లిపోయాడు.

భర్త నాడి చూసిన స్వరూపరాణి ఎట్టి పరిస్ధితుల్లోనూ శ్రీనివాసరావు బతకకూడదని చెప్పింది. దీంతో వీరబాబు మరింత బలంగా చెక్కతో శ్రీనివాసరావును కొట్టి హతమార్చాడు. ముందు అనుకున్నట్లు శ్రీనివాసరావు ను ఎవరో వచ్చి కాళ్లు చేతులు కట్టేసి కొట్టి చంపినట్లు క్రియేట్ చేశారు. ఒంటికి అంటుకున్న రక్తపు మరకలు కడుక్కుని, బట్టలు మార్చుకుని తన మోటారు సైకిల్ పై నిందితుడు వీరబాబు వెళ్లిపోయాడు.

అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు పొద్దున్నే నిద్రలేచినట్లుగా నటిస్తూ స్వరూపరాణి ఏడుపు లంకించుకుంది. ఎవరో వచ్చి తన భర్తను నిర్ధాక్షిణ్యంగా కొట్టి చంపారంటూ ఏడుస్తూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మూడు బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించే సరికి స్వరూపరాణికి, వీరబాబుకు భయం పట్టుకుంది. తనను పట్టుకుంటే నువ్వే అంతా చేయించావని చెపుతానని వీరబాబు స్వరూపరాణిని ఫోన్ లో బెదిరించాడు. దీంతో తన బండారం బయటపడుతుందని భయపడిన స్వరూపరాణి ఫిబ్రవరి 12న ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

స్వరూపరాణి ఆత్మ హత్య కేసు నమోదు చేసుకున్నో పోలీసులు ఆమె సెల్ ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ చేపట్టారు. అప్పటికే నేర స్ధలానికి దగ్గరలో ఉన్న సీసీటీపీ ఫుటేజి ఆధారాలు సేకరించిన పోలీసులు పక్కా ఆధారాలతో నిందితుడు వీరబాబును పిఠాపురంలో అరెస్ట్ చేశారు. నిందితుడిపై హత్యా నేరంతోపాటు, ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసును నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.