Girl assault : బెదిరించి టెన్త్ విద్యార్థినిపై కొంతకాలంగా అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక

బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు చందర్లపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Girl assault : బెదిరించి టెన్త్ విద్యార్థినిపై కొంతకాలంగా అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక

Man Assault Girl

Updated On : August 13, 2023 / 4:06 PM IST

Man Assault Girl And Got Her Pregnant : దేశంలో అమ్మాయిలు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. నిర్భయ లాంటి ఎన్ని చట్టాలొచ్చినా అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనేవున్నాయి. నిత్యం ఏదోఒక చోట అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురవుతూనేవున్నారు. అమ్మాయిలు, మహిళలకు ఇంటా బయట భద్రత లేకుండా పోయింది. తాజాగా ఏపీలో మరో ఘోరం జరిగింది.

ఎన్టీఆర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. టెన్త్ విద్యార్థినిని బెదిరించి ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడంతో గర్భం దాల్చారు. చందర్లపాడు మండలం చింతలపాడులో మాణిక్యాలరావు అనే వ్యక్తి టెన్త్ విద్యార్థినిని బెదిరించి ఆమెపై గత కొంతకాలంగా అత్యాచారం చేస్తున్నాడు.

Girl Assault : బీహార్ లో దారుణం.. బాలికను కిడ్నాప్ చేసి, 28 రోజులపాటు సామూహిక అత్యాచారం

దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు చందర్లపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.