Man Died : ఒంగోలు రైల్వేస్టేషన్‌లో రైలు కిందపడి వ్యక్తి మృతి

మంచినీళ్లు పట్టుకుని తిరిగి వచ్చేసరికి రైలు కదులుతోంది. రైలు ఎక్కేందుకు ప్రయత్నించి కాలు జారి రైలు కింద పడిపోయాడు.

Man Died : ఒంగోలు రైల్వేస్టేషన్‌లో రైలు కిందపడి వ్యక్తి మృతి

Train

Updated On : March 24, 2022 / 8:07 AM IST

railway station : ఒంగోలు రైల్వేస్టేషన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. తిరుపతి -పూరి ఎక్స్‌ప్రెస్ ఎక్కిన గణేష్‌ అనే వ్యక్తి… పిల్లలకు మంచినీళ్లు తెచ్చేందుకు ఒంగోలు స్టేషన్‌లో రైలు దిగాడు. మంచినీళ్లు పట్టుకుని తిరిగి వచ్చేసరికి రైలు కదులుతోంది.

రైలు ఎక్కేందుకు ప్రయత్నించి కాలు జారి రైలు కింద పడిపోయాడు. తోటి ప్రయాణీకులు కాపాడేందుకు యత్నించి రైలు చైన్‌ లాగారు. కానీ అప్పటికే అతను మృతి చెందడంతో భార్యా పిల్లలు రోదించారు.