East Godavari : మరదలుతో వివాహేతర సంబంధం.. ఆమెకు పెళ్లి కుదరడంతో హత్యాయత్నం చేసి ఆత్మహత్య చేసుకున్న బావ

పెళ్లి వేడుకలో పాటలు పాడుతున్న మరదలను మధ్యలోనే బయటికి తీసుకువచ్చారు. ఊరి చివర ఉన్న ఆయిల్ పామ్ తోటలోకి తీసుకు వెళ్లి కత్తితో సత్యనారాయణ ఆమె గొంతుపై పలుమార్లు పొడిచాడు.

East Godavari : మరదలుతో వివాహేతర సంబంధం.. ఆమెకు పెళ్లి కుదరడంతో హత్యాయత్నం చేసి ఆత్మహత్య చేసుకున్న బావ

East Godavari

Updated On : June 11, 2023 / 12:55 PM IST

man attempt kill woman : తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. మరదలుపై హత్యాయత్నం చేసిన బావ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన నల్లజర్ల మండలం పోతినీడుపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. పెదపూడి సత్యనారాయణ 8నెలల క్రితం మేనమామ పెద్ద కుమార్తెను వివాహం చేసుకున్నారు. సత్యనారాయణ సెలూన్ షాప్ నిర్వహిస్తూ బ్యాండ్ పార్టీ నడుపుతున్నాడు.

ఈ నేపథ్యంలో బ్యాండ్ పార్టీలో పాటలు పాడేందుకు వచ్చే తన మరదలుతో సత్యనారాయణ వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. అయితే, మరదలుకు వివాహం కుదిరింది. మరదలుకు వివాహం కుదరడంతో తనకు దూరమవుతుందని బావించిన బావ సత్యానారాయణ ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నారు.

Uttar Pradesh : గుడిలో నమాజ్ చేసిన వ్యక్తి అరెస్టు

పెళ్లి వేడుకలో పాటలు పాడుతున్న మరదలను మధ్యలోనే బయటికి తీసుకువచ్చారు. ఊరి చివర ఉన్న ఆయిల్ పామ్ తోటలోకి తీసుకు వెళ్లి కత్తితో సత్యనారాయణ ఆమె గొంతుపై పలుమార్లు పొడిచాడు. ఆ తరువాత కోండ్రుపాడు రైల్వే ట్రాక్ వద్దకు వచ్చి తన చెల్లెలుకు ఫోన్ చేసి విషయం చెప్పాడు.

అనంతరం సత్యనారాయణ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న యువతిని చికిత్స కోసం గ్రామస్థులు తాడేపల్లి గూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై నల్లజర్ల పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.