Sujana Chowdary: థియేటర్లు మూసివేతతో ఎంతోమంది ఉపాధి కోల్పోతారు
థియేటర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి.

Sujana
Sujana Chowdary: థియేటర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి. థియేటర్లు మూసివేయడం వల్ల దాని మీద ఆధారపడ్డవారు ఉపాధి కోల్పోతారని అన్నారు. థియేటర్ల యజమానులంతా ఒక్కటై న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు సుజనా చౌదరి.
విశాఖపట్నంలో పర్యటించిన సుజనా చౌదరి.. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తలాతోక లేని పాలన జరుగుతోందని, వచ్చే 30నెలల్లో బీజేపీ సమర్ధత ఏంటో చూపిస్తామని అన్నారు సుజనా చౌదరి.