Maoists Set Fire Bus : ఏపీలో మావోయిస్టుల దుశ్చర్య.. బస్సును దగ్ధం చేసిన మావోలు

అర్ధరాత్రి 12 గంటలకు కొత్తూరు వద్ద మావోయిస్టులు బస్సును అడ్డగించి ప్రయాణికులను కిందకు దించి బస్సుపై డీజిల్ పోసి తగలబెట్టారు. ప్రయాణికులు భయాందోళనకు గురై సర్వేల గ్రామంలో కొంతమంది ఇళ్లలో తలదాచుకొని ఈరోజు ఉదయం చింతూరు చేరుకున్నారు.

Maoists Set Fire Bus : ఏపీలో మావోయిస్టుల దుశ్చర్య.. బస్సును దగ్ధం చేసిన మావోలు

Maoists

Updated On : April 25, 2022 / 6:55 AM IST

Maoists Set Fire Bus : ఏపీలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. తూర్పుగోదావరి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు ఏజన్సీలో ఓ బస్సుకు నిప్పంటించారు. కొత్తూరు జాతీయ రహదారిపై అర్ధరాత్రి సమయంలో చత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రైవేటు బస్సును మావోలు దగ్ధం చేశారు. దండకారణ్యం బంద్ పాటించాలని కోరుతూ ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం.

అర్ధరాత్రి 12 గంటలకు కొత్తూరు వద్ద మావోయిస్టులు బస్సును అడ్డగించి ప్రయాణికులను కిందకు దించి బస్సుపై డీజిల్ పోసి తగలబెట్టారు. ప్రయాణికులు భయాందోళనకు గురై సర్వేల గ్రామంలో కొంతమంది ఇళ్లలో తలదాచుకొని ఈరోజు ఉదయం చింతూరు చేరుకున్నారు.

Chhattisgarh : మందుపాతర పేల్చిన మావోయిస్టులు

ఈ ఘటనలో కొంతమంది ప్రయాణీకులకు గాయాలు అవ్వడంతో చింతూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై అప్రమత్తమైన చింతూరు పోలీసులు, విచారణ చేపట్టారు.