AP Metro Rail Projects: ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులపై సర్కార్ ఫోకస్.. విదేశీ బ్యాంకు ప్రతినిధులతో చర్చలు

విశాఖ మెట్రోకి 6వేల 100 కోట్లు, విజయవాడ మెట్రోకి 5వేల 900 కోట్ల రుణం సమీకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

AP Metro Rail Projects: ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులపై సర్కార్ ఫోకస్.. విదేశీ బ్యాంకు ప్రతినిధులతో చర్చలు

Updated On : May 15, 2025 / 12:38 AM IST

AP Metro Rail Projects: ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక ముందడుగు పడింది. పలు విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే బ్యాంకులతో ఎండీ సంప్రదింపులు జరిపారు. ఈ సమావేశానికి కేఎఫ్ డబ్లు, ఏఎఫ్ డీ, ఏడీబీ, ఎన్డీబీ, ఏఐఐబీ, జైకా, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు హాజరయ్యారు. వీరంతా విజయవాడలో ప్రతిపాదిత మెట్రో కారిడార్స్ ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో విశాఖ మెట్రోకి 6వేల 100 కోట్లు, విజయవాడ మెట్రోకి 5వేల 900 కోట్ల రుణం సమీకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో రెండు మెట్రో రైల్ ప్రాజెక్టులు రాబోతున్నాయి. దీనికి సంబంధించి విశాఖ, విజయవాడలో మెట్రో రైల్ ఏర్పాటు చేయాలని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. గత ఐదేళ్లు ఈ ప్రాజెక్ట్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. తిరిగి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో మెట్రో రైల్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి విదేశీ బ్యాంకులు లోన్లు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. దీంతో త్వరలో మెట్రో రైలు పనులు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు దీనిపై దృష్టి పెట్టారు. విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. తక్కువ వడ్డీకి ఎవరైతే రుణాలు ఇస్తారో వారితో చర్చలు జరిపి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుని ప్రాజెక్ల్ లను పూర్తి చేయాలని భావిస్తున్నారు. మెట్రో రైలు వెళ్లే ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రస్తుతానికి మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు రుణాలు ఇచ్చేందుకు KFW, AFD, ADB, NDB, AIIB, JICA, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Also Read: ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త.. అందుబాటులోకి సరికొత్త యాప్.. ఇంట్లో నుంచే రుణ వాయిదాలను చెల్లించొచ్చు

దాదాపు 1200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. విశాఖ మెట్రో రైలుకి 6100 కోట్లు, విజయవాడ మెట్రో రైలుకి 5వేల 900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. తక్కువ వడ్డీకి ఎవరైతే లోన్ ఇస్తారో ఆ బ్యాంక్ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.