AP Tenth Inter Exams : ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు.. మంత్రి కీలక వ్యాఖ్యలు
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి సునామీ సృష్టిస్తోంది. కొత్త కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. తాజాగా ఏకంగా 10వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. కోవిడ్ నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు టెన్త్ పరీక్షలు రద్దు చేశాయి. పరీక్షలు లేకుండానే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను ప్రమోట్ చేశారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా వేశారు. మరి ఏపీ సంగతి ఏంటి. టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారా? రద్దు చేస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Tenth Exams
AP Tenth Inter Exams : ఏపీలో కరోనావైరస్ మహమ్మారి సునామీ సృష్టిస్తోంది. కొత్త కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. తాజాగా ఏకంగా 10వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. కోవిడ్ నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు టెన్త్ పరీక్షలు రద్దు చేశాయి. పరీక్షలు లేకుండానే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను ప్రమోట్ చేశారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలు వాయిదా వేశారు. మరి ఏపీ సంగతి ఏంటి. టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారా? రద్దు చేస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
తాజాగా పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. మరోసారి సమీక్ష జరిపిన అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు. విద్యార్థులు, టీచర్ల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని తదుపరి నిర్ణయం ఉంటుందన్నారు. కాగా, సీఎం జగన్ తో రేపు(ఏప్రిల్ 23,2021) జరిగే సమీక్షలో పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునే చాన్సుందని తెలుస్తోంది.
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రాజకీయ దుమారం రేపాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పరీక్షలపై టీడీపీ నేత నారా లోకేష్ వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. విద్యా సంవత్సరాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, పరీక్షలపై నారా లోకేష్ రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. లోకేష్ వ్యాఖ్యలు విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని తగ్గించే విధంగా ఉన్నాయన్నారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వ చర్యలు లోకేష్‌కు కనిపించడం లేదా అని మంత్రి ప్రశ్నించారు. వకీల్‌సాబ్‌కు వకాల్తా పుచ్చుకున్నప్పుడు లోకేష్‌కు కరోనా గుర్తుకు రాలేదా అని మంత్రి నిలదీశారు.
రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్న వార్తల నేపథ్యంలో లోకేష్ మండిపడ్డారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులకు కరోనా సోకి, ఆ తర్వాత వాళ్ల కుటుంబ సభ్యులు మహమ్మారి బారిన పడితే ముఖ్యమంత్రి జగన్ బాధ్యత తీసుకుంటారా? అని లోకేష్ ప్రశ్నించారు. అంతేకాదు, పరీక్షలు నిర్వహిస్తే 80 లక్షల మంది కరోనా బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలతో ఆన్ లైన్ లో భేటీ అయిన సందర్భంలో లోకేష్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనికి మంత్రి ఆదిమూలపు సురేష్ కౌంటర్ ఇచ్చారు.