MInister Anil Kumar: దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి.. – అనిల్ కుమార్
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వేదికగా అనిల్ కుమార్ టీడీపీకి ఛాలెంజ్ విసిరారు. తమకు ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా ఉందని, మీకు దమ్ముంటే అలా గెలిచి చూపించండంటూ టీడీపీ నాయకులను సవాల్ చేశారు.

Minister Anil Kumar
MInister Anil Kumar: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వేదికగా అనిల్ కుమార్ టీడీపీకి ఛాలెంజ్ విసిరారు. తమకు ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా ఉందని, మీకు దమ్ముంటే అలా గెలిచి చూపించండంటూ టీడీపీ నాయకులను సవాల్ చేశారు.
‘టీడీపీ నాయకుడు చంద్రబాబు కొద్ది రోజుల క్రితం సభకు రానని చెప్పి వెళ్లిపోయాడు. ఆయనతో పాటు వెళ్లిపోయిన వాళ్లంతా నాయకుడిపై నమ్మకం లేక సభకు వస్తున్నారు. అతణ్ని నమ్ముకుంటే వస్తామో రామోననే భయంతోనే మళ్లీ సభకు వస్తున్నారు’
‘శాసనమండలిలో లోకేష్ కూడా వాళ్ళ తండ్రిపై నమ్మకం లేక చివరి సంవత్సరం సభలో ఉందామని శాసనమండలి వస్తున్నారు’
‘జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సభ నుంచి వెళ్లిపోయి.. మళ్లీ 151 మందిని గెలిపించుకున్న తర్వాతే సభకు వచ్చారు. 2024 ఎన్నికల్లో మళ్లీ ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాం’
‘ఒంటరిగా పోటీ చేసే దమ్ము మీకుందా. దమ్ముంటే మీరు కూడా ఒంటరిగా పోటీ చేయండి. పొత్తులు పెట్టుకుని ముందుకు వెళ్ళటం మీ చరిత్ర. దమ్ముంటే ఒంటరిగా ఎన్నికలకు వెళతామని మాటివ్వండి’ అంటూ టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు అనిల్ కుమార్.