Anil Kumar Yadav: పవన్ నటించినా.. సంపూర్ణేష్ నటించినా కష్టం ఒకటే! -మంత్రి అనిల్ కుమార్ యాదవ్
జవాబుదారీతనం కోసమే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అమ్ముతున్నట్లుగా వెల్లడించారు రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి అనీల్ కుమార్ యాదవ్.

Anil Kumar Yadav: జవాబుదారీతనం కోసమే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అమ్ముతున్నట్లుగా వెల్లడించారు రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి అనీల్ కుమార్ యాదవ్. పవన్ కళ్యాణ్ నటించినా.. సంపూర్ణేష్ బాబు నటించినా.. కష్టం అనేది ఇద్దరిదీ ఒకటేనని, ఆన్‌లైన్ టికెట్ల పోర్టల్ కోసం చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దలతో చర్చించినట్లు చెప్పారు అనీల్.
ఆన్‌లైన్ పోర్టల్ అంటే ఎందుకంత భయం? దాని వల్ల జరిగే నష్టం ఏమిటి? అని ప్రశ్నించారు. జవాబుదారీతనం, అమ్మకాల్లో పారదర్శకత రావాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచనయని అన్నారు. ప్రతీ ఒక్కరికీ టికెట్ ధర ఒకేలా ఉండాలనేది ప్రభుత్వం ఉద్దేశమన్నారు.
సినిమాకి ఖర్చు పెట్టుకుని నలుగైదుగురు మాత్రమే లబ్ధి పొందితే, మిగిలినవారు నష్టపోవడం సబబేనా? నా ఒక్కడి కోసం చిత్రసీమను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పవన్ కళ్యాణ్ మాట్లాడడం సరికాదు. చిత్రపరిశ్రమను ఇబ్బంది పెట్టే ఆలోచనే మా ప్రభుత్వానికి లేదు. చిత్రపరిశ్రమను ఇబ్బంది పెట్టేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ క్రియేట్ చేస్తున్నారని అన్నారు.
పవన్ కళ్యాణ్ ఒక పక్క సీఎం జగన్‌ను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో మాట్లాడుతూ.. జగన్ చిత్ర పరిశ్రమను ఇబ్బంది పెడుతున్నారనే ప్రొజక్షన్ ఇచ్చుకోవడం కరెక్ట్ కాదన్నారు అనీల్ యాదవ్. రాజకీయ ఉనికి కోసం సీఎం జగన్‌ను తిట్టడం పవన్ కళ్యాణ్‌కు ఫ్యాషన్ అయిపోయింది.
ప్రభుత్వ తీరును మారుస్తానని, నేను రోడ్డు కొస్తే మనిషిని కాదు.. బెండు తీస్తాం.. అని పవన్ కళ్యాణ్ మాట్లాడటం చాలా సార్లు చూశామని విమర్శించారు.