ఎంపీ సుజనాపై బోత్స గరం గరం..మీరు చెప్పినట్లు వినాలా

బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై ఏపీ మంత్రి బోత్స నారాయణ గరం గరంగా ఉన్నారు. ఆయపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు చెప్పినట్లు వినాలా అంటూ ప్రశ్నించారు. మీ మాటైమైనా శాసనమా ? లేక వేదమా అంటూ ఘాటు వ్యాఖ్యలతో విరుచుకపడ్డారు. రాజధాని అంశంపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీకి సంబంధించిన వివరాలను మంత్రి బోత్స..2019, డిసెంబర్ 29వ తేదీ ఆదివారం మీడియాకు తెలిపారు.
ఈ క్రమంలో అమరావతిని ఒక్క అంగుళం కూడా కదల్చడానికి వీల్లేదని ఇటీవలే సుజనా వ్యాఖ్యానించడంపై ఆయన స్పందించారు. టీడీపీలో ఉండి బీజేపీలో చేరిన వ్యక్తి చెవిలో..భారత ప్రధాని మోడీ..చెప్పారా అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు తొత్తువా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన తప్పులను సరిదిద్దు కోవడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు. తమ ప్రభుత్వానికి అన్ని జిల్లాల అభివృద్ధే ధ్యేయమని మరోసారి స్పష్టం చేశారు. తమకు ప్రాంతీయ ధ్వేషం ఉండదన్నారు.
విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిందన్న ఆరోపణలపై కూడా మంత్రి బోత్స రెస్పాండ్ అయ్యారు. ఆధారాలతో వస్తే ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని స్పష్టం చేశారు. మూడు రాజధానులపై అధికారిక ప్రకటన రాకముందే..ఆరోపణలు చేయడం సరికాదని బోత్స ప్రతిపక్షాలకు సూచించారు. రాజధానికి విశాఖ అనుకూలమనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.
* వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడం ఇష్టమా ? కాదా ? చెప్పాలి.
* హై పవర్ కమిటీ ముఖ్యోద్దేశ్యం 13 జిల్లాలను అభివృద్ధి చేయడమే.
* కమిటీ భౌగళోక పరిస్థితులపై అధ్యయనం చేస్తుంది.
* జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలను పరిశీలిస్తుంది.
* నివేదికలను పరిశీలించి..కేబినెట్ సమావేశంలో చర్చించి..అసెంబ్లీలో ప్రకటన.
జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ, కేంద్రం ఆధ్వర్యంలో శివరామకృష్ణన్ కమిటీలు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. రాజధాని ఏర్పాటు, జిల్లాల అభివృద్ధి తదితర విషయాలు ఈ కమిటీలు నివేదికలు సమర్పించడం జరిగిందన్నారు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూసి..జరిగిన తప్పులను సరిదిద్దాలని భావించి హై పవర్ కమిటీని సీఎం జగన్ వేయడం జరిగిందని వివరించారు.
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో నిపుణుల కమిటీ దేన్ని కూడా పరిశీలనలోకి తీసుకోలేదన్నారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న నారాయణ ఆధ్వర్యంలో వేసిన కమిటీ..రాజకీయలకు అవసరంగా పనిచేశారని తెలిపారు. అమరావతిని లక్షా 9 వేల కోట్ల రూపాయలు ముందుగా అవసరమని గుర్తించారని, ఈ నిధులను రెండు ఫేజ్‌ల్లో ఉపయోగించాలన్నారు. ఐదు సంవత్సరాలు పాలన అవకాశం ఇచ్చినా..రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. స్వార్థపూరిత రాజకీయాలు, అవినీతిని చేశారనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు.