Botsa Satyanarayana: పొత్తులపై ఆలోచిస్తారో.. మొక్కజొన్న పొత్తుల గురించి ఆలోచిస్తారో చూద్దాం: బొత్స

జనసేన ఆవిర్భావ సభలో వ్యక్తిగత ఆరోపణలు తప్పితే విధానపరమైన మాటలు సభలో పవన్ మాట్లాడలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు

Botsa Satyanarayana: పొత్తులపై ఆలోచిస్తారో.. మొక్కజొన్న పొత్తుల గురించి ఆలోచిస్తారో చూద్దాం: బొత్స

Botsa

Updated On : March 15, 2022 / 8:48 PM IST

Botsa Satyanarayana: ఉగాది నుంచి పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సంక్షేమ కార్యక్రమాల ఫలితం ప్రతి ఇంటికి చేరేలా సీఎం జగన్ దిశా నిర్ధేశం చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి బొత్స సత్యనారాయణ పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేశామన్న మంత్రి బొత్స..ప్రభుత్వం చేసిన కార్యక్రమాల పై చంద్రబాబు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని..వాటికి ధీటుగా పార్టీ ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చెప్పినట్లు పేర్కొన్నారు. మంత్రి వర్గ విస్తరణ కోత్తేమి కాదని.. ముందు చెప్పిన విధంగానే విస్తరణ గురించి మళ్ళీ సమావేశంలో చర్చించినట్లు మంత్రి తెలిపారు. పదవులు పోయే 80 శాతం మంది మంత్రులకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని ఆయన అన్నారు.

Also read: Power Bills : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందే

జనసేన ఆవిర్భావ సభలో వ్యక్తిగత ఆరోపణలు తప్పితే విధానపరమైన మాటలు సభలో పవన్ మాట్లాడలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అధికార పార్టీని ఓడించాలని అనుకున్నప్పుడు విధాన పరమైన అంశాలు మాట్లాడాలని..అలా కాకుండా మంత్రులు, వ్యక్తులపై పవన్ వ్యక్తిగత దూషణలు చేస్తే ప్రజలు పట్టించుకోరని బొత్స హితవు పలికారు. కార్యకర్తల ఆనందం కోసం పవన్ డైలాగ్ చెప్తే వారు ఉర్రుతలు ఊగొచ్చని మంత్రి బొత్స అన్నారు. వైసీపీ ప్రభుత్వం రౌడీఇజం చేస్తుందన్న పవన్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ఎక్కడ రౌడీఇజం చేసిందో చూపించాలని పవన్ ను ప్రశ్నించారు. “రౌడీయిజం అంటే సినిమా అనుకుంటున్నవా, ఇది ప్రజాస్వామ్యం, రౌడీయిజం ఎక్కడుందో చూపించు” అంటూ పవన్ ను మంత్రి బొత్స ప్రశ్నించారు.

Also read: AP Corona Report : ఏపీలో కొత్తగా 59 కరోనా కేసులు

ఇక బీజేపీతో జనసేన పొత్తు అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. పవన్ దగ్గర రోడ్డు మ్యాప్ లేదు, పవన్ కు రౌడ్ మ్యాప్ పై అవగాహన లేదు కాబట్టే బీజేపీని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన దగ్గర కార్యచరణ లేదు కాబట్టే బీజేపీ చెప్పినట్టు వెళ్తామని పవన్ చెప్పడం నిజమేనని మంత్రి బొత్స పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ను తాను కామిడీ చేస్తూ మాట్లాడడం లేదని..వున్నదే చెబుతున్నానని మంత్రి బొత్స అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చడం ఇష్టం లేదంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ స్పందిస్తూ వైసీపీకి వ్యతిరేక ఓట్లు ఉంటేనేగా చీల్చడానికి అంటూ సమాధానం ఇచ్చారు.

Also read: Jagan Warning To MLAs: వారికి నో టికెట్.. ఎమ్మెల్యేలకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్

సినిమాకి వచ్చినట్టే పవన్ కళ్యాణ్ సభకు జనం వచ్చారని..పొత్తులు గురించి ఆలోచిస్తారో మొక్కజొన్న పొత్తుల గురించి అలిచిస్తారో చూద్దామని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. పొత్తులు, మొక్కజొన్న పొత్తులు మా దగ్గర లేవన్న బొత్స..మేము ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. పార్టీ అధినేత జగన్ అభీష్టం మేరకు ఎన్నికల సమయంలో ఎవరితోనైనా పొత్తులు పెట్టుకోవాలని ఆలోచిస్తే అప్పుడు చూద్దామని ఇప్పటికైతే వైసీపీకి ఎటువంటి పొత్తులు లేవని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

Also read: Jagan On Cabinet Expansion : వైసీపీ ప్లీనరీ తర్వాతే.. కేబినెట్ విస్తరణ-సీఎం జగన్