Chelluboina Venugopala Krishna : రాజకీయాలు వదిలేస్తా- మంత్రి సంచలన వ్యాఖ్యలు
సీఎం జగన్ తనను రాజమండ్రి రూరల్ కు వెళ్లమన్నారని, ఆయన ఏం చెబితే అది చేసేందుకు తాను సిద్ధంగా ఉంటానన్నారు.

Chelluboina Srinivasa Venugopala Krishna Comments
ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ అంశంలో మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ముందే అడిగి ఉంటే ఆయనకే ఇవ్వమని అడిగేవాడిని అని, అలా కాకుండా తనను ఒక దొంగగా చిత్రీకరించడం బాధేసిందన్నారు. బోస్ ఎన్ని మాటలు అన్నా తాను ఏనాడూ విమర్శించలేదన్నారు.
తాను కానీ తన కుమారుడు కానీ అవినీతికి పాల్పడినట్లుగా నిరూపిస్తూ రాజకీయాలే వదిలేస్తా అని చెప్పారు. రామచంద్రపురంలో మళ్లీ అశాంతి నెలకొల్పేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ప్రజలంతా దాన్ని ప్రటిఘటించాలన్నారు మంత్రి వేణుగోపాల కృష్ణ. ఇక అసెంబ్లీ టికెట్ మార్పు విషయంపైనా మంత్రి వేణు స్పందించారు. సీఎం జగన్ తనను రాజమండ్రి రూరల్ కు వెళ్లమన్నారని, ఆయన ఏం చెబితే అది చేసేందుకు తాను సిద్ధంగా ఉంటానన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకల్లో మంత్రి వేణు పాల్గొన్నారు.
Also Read : పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాకలో గోలీలు ఆడుకున్నాడా? వాళ్లు ముగ్గురు వలస వెళ్లిన వాళ్లే..
”జగనన్న నన్ను రాజమండ్రి రూరల్ కి వెళ్ళమన్నారు. అన్నా.. నేను నీకు విధేయుడిని.. నీవు కత్తి పట్టుకుని ఉండి నిన్ను నరికేస్తానంటే.. ఎందుకని అడుగకుండా తల పెట్టగల సమర్ధత, ధైర్యం నాకు ఉంది. రామచంద్రపురం నియోజకవర్గంలో మళ్లీ అశాంతిని సృష్టించడానికి కుట్రలు జరుగుతున్నాయి. ప్రజలు ప్రతిఘటించాలి. 30ఏళ్ళు శత్రువులను మిత్రులుగా (తోట, బోస్) మార్చిన ఘనుడిని నేను. ఒకే ఒక్కడిని. దటీజ్ వేణు గోపాల్. శెట్టి బలిజలకు బోస్ ఒక ఐకాన్. పెద్దాయన వంద మాటలు అన్నా నేను ఏనాడు విమర్శించలేదు.
Also Read : ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అంటున్న పవన్ కల్యాణ్.. నేర్చుకోవాల్సింది ఏమిటి? సరిదిద్దుకోవాల్సింది ఏమిటి?
టిక్కెట్ విషయంలో జగన్ అడగక ముందే బోస్ అడుగుంటే బోస్ కాళ్ళు కడిగి తలమీద నీళ్లు జల్లుకుని ఆయనకు అప్పగించేవాడిని. అలా కాకుండా నన్ను ఒక దొంగగా చిత్రీకరించడం బాధించింది. నేను కానీ, నా కొడుకు కానీ అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తాను. పార్టీ కోసం త్యాగం చేసి వెళ్తున్నా. 2019 ఎన్నికల్లో నాకు అడ్రస్ లేదన్నారు.
కానీ ప్రజలకు నాకు అడ్రస్ ఇచ్చారు. అడ్రస్ ఇచ్చిన వరదాతలకు కృతజ్ఞతలు. ఇప్పుడు ఇద్దరు కాదు 20మంది కలిసినా నా అడ్రస్ మారదు. నా ఆధార్ కార్డు, నా ఇల్లు ఇక్కడే ఉంది. నా ఎదుగుదలకు దోహదపడిన బోస్, తోట త్రిమూర్తులకు ప్రజల తరపున ధన్యవాదాలు. రామచంద్రపురంను రక్షించాలి” అని పిలుపునిచ్చారు మంత్రి వేణు.