Kodali Nani : పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాకలో గోలీలు ఆడుకున్నాడా? వాళ్లు ముగ్గురు వలస వెళ్లిన వాళ్లే..
పవన్, లోకేశ్, చంద్రబాబు ఇప్పుడు గంటలు మోగిస్తూ యుద్ధభేరి మెదలెట్టినా జగన్ జైత్రయాత్ర పరంపరను ఆపలేరని కొడాలి నాని అన్నారు.

Kodali Nani
YCP MLA Kodali Nani : యువగళం విజయోత్సవ సభపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్, లోకేశ్, చంద్రబాబు పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అడుగు ఊడిపోయిన బక్కెట్ గాళ్లంతా నిన్నచేసింది పిల్లి మెడలో గంటకట్టే ప్రయత్నమే. సీఎం జగన్ 2009 సెప్టెంబర్ 2నే యుద్ధం మొదలు పెట్టారు. 12ఏళ్ల క్రితం యుద్ధభేరి మోగించిన జగన్ సోనియాను కూకటివేళ్లతో పెకలించేశారు. చంద్రబాబును భూస్థాపితం చేసి.. పవన్ కళ్యాణ్ ను రెండుచోట్ల చిత్తు చేస్తూ మంగళగిరిలో లోకేశ్ కు సమాధి కట్టాడు అంటూ కొనాడాలి నాని అన్నారు.
Also Read : KA Paul : చంద్రబాబుకు కేఏ పాల్ ఛాలెంజ్.. ఆ ముగ్గురు నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు
పవన్, లోకేశ్, చంద్రబాబు ఇప్పుడు గంటలు మోగిస్తూ యుద్ధభేరి మెదలెట్టినా జగన్ జైత్రయాత్ర పరంపరను ఆపలేరని కొడాలి నాని అన్నారు. ఎమ్మెల్యేలకు ట్రాన్స్ ఫర్లు ఉంటాయా అంటూ చంద్రబాబు విచిత్రంగా మాట్లాడుతున్నాడు.. 30ఏళ్ల క్రితమే చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం ట్రాన్స్ ఫర్ అయ్యాడు. లోకేశ్ పుట్టింది మంగళగిరిలోనా..? పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాకలో గోలీలు ఆడుకున్నాడా? అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. తండ్రి, కొడుకు, వాళ్ల పార్ట్నర్ ముగ్గురూ వలస వెళ్లిన వాళ్లే. బోరా గాళ్లంతా మొదలెట్టిన యుద్ధభేరితో సీఎం జగన్ చిటికెన వేలిని కూడా కదపలేరని కొడాలి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.