Gudivada Amarnath : పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలా లేక చంద్రబాబు పార్టీ అధ్యక్షురాలా : మంత్రి గుడివాడ అమర్నాథ్
బీజేపీ పాలిత ప్రాంతాల్లో లిక్కర్ అమ్మడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో విశాఖలో జరిగిన భూ దందా గురించి పురంధేశ్వరి మాట్లాడొచ్చు కదా అని అన్నారు.

Gudivada Amarnath
Gudivada comments Purandeshwari : బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఏపీ రాష్ట్ర పురంధేశ్వరి మాటలు చంద్రబాబు స్క్రిప్ట్ లా ఉందన్నారు. ఆమె బీజేపీ అధ్యక్షురాలా లేక చంద్రబాబు పార్టీ టీడీపీ అధ్యక్షురాలా అన్న అనుమానం కలుగుతోందన్నారు. చంద్రబాబు కోసం పురంధేశ్వరి పనిచేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి విశాఖలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పార్టీ(టీడీపీ)ని గెలిపించడానికి ఆమె తాపత్రయ పడుతున్నారని పేర్కొన్నారు.
నిజంగా ఆమెకు ఆ పార్టీ, రాష్ట్రంపై అభిమానం ఉంటే టీడీపీ పగ్గాలు చేపట్టొచ్చు కదా అని అన్నారు. “టీడీపీలో కీలకమైన మీ భర్త పరిస్థితి ఏంటి? మాయల పకీరు చంద్రబాబు మాటలు నమ్మి ఏమయ్యారు” అని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని పురంధేశ్వరి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వ పథకాల కోసం ఖర్చు చేస్తున్నారని తెలిపారు.
Justice Dhiraj Singh Thakur : ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం
బీజేపీ పాలిత ప్రాంతాల్లో లిక్కర్ అమ్మడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో విశాఖలో జరిగిన భూ దందా గురించి పురంధేశ్వరి మాట్లాడొచ్చు కదా అని అన్నారు. సీఎంను ఒప్పించి 24 గంటల్లో భూములు ఇప్పిస్తామని.. పురంధేశ్వరి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ప్రకటన చేయించాలన్నారు. విశాఖలో అక్రమాల గురించి మాట్లాడే ముందు మణిపూర్ గురించి మాట్లాడాలని పేర్కొన్నారు.