Kodali Nani : లోకేష్‌లో మార్పులకు కారణం అదేనా? మంత్రి సంచలన వ్యాఖ్యలు

టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేశ్, జనసేనాని పవన్ కళ్యాణ్ లపై ఏపీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే నీచుడు చంద్రబాబు అని ఎన్టీఆర

Kodali Nani : లోకేష్‌లో మార్పులకు కారణం అదేనా? మంత్రి సంచలన వ్యాఖ్యలు

Kodali Nani

Updated On : October 10, 2021 / 7:14 PM IST

Kodali Nani : టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేశ్, జనసేనాని పవన్ కళ్యాణ్ లపై ఏపీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కమ్మ రాజ్యాన్ని స్థాపించేందుకు చంద్రబాబు, పవన్ ప్రయత్నిస్తున్నారని కొడాలి నాని అన్నారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే నీచుడు చంద్రబాబు అని ఎన్టీఆర్ కూడా సర్టిఫికెట్ ఇచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ వంటి నీచమైన వ్యాపారాలతో లింకులు ఉండేది చంద్రబాబుకేనని ఎదురు దాడికి దిగారు.

మాదకద్రవ్యాల సరఫరాలో అఫ్ఘానిస్తాన్ టు తాడేపల్లికి లింకులున్నాయని చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను మంత్రి కొడాలి నాని తీవ్రంగా ఖండించారు. డ్రగ్స్‌ సరఫరా అంశంలో సీఎం జగన్‌కు సంబంధాలున్నాయని చంద్రబాబుకు ఎవరు చెప్పారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా సంఘాలను చంద్రబాబు నిలువునా మోసం చేస్తే, ఎన్నికల నాటికి ఉన్న అప్పును 4 విడతల్లో చెల్లిస్తానని సీఎం జగన్‌ హామీ ఇచ్చి నిలబెట్టుకున్నారన్నారు. రెండు విడతల్లో కలిపి రూ.13 వేల కోట్లు మహిళా సంఘాలకు సీఎం జగన్ చెల్లించారన్నారు.

Face Book Friend Cheating : ఫేస్‌బుక్ లో పరిచయం….రూ. 27లక్షలు దోచేసిన యువతులు

ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ, పురపాలక, నగరపాలక ఎన్నికల్లో అన్ని చోట్లా బాబును ప్రజలు ఓడించారని మంత్రి అన్నారు. అందుకే ఇప్పుడు బద్వేలు ఉప ఎన్నిక నుంచి చంద్రబాబు పారిపోయాడని హేళన చేశారు. సీఎం జగన్ కు అపూర్వ ప్రజాదరణ లభిస్తుండడంతో, తన మనుషులతో విషం కక్కిస్తున్నాడని కొడాలి నాని మండిపడ్డారు.

ఇటీవల లోకేశ్ లో వచ్చిన మార్పులు డ్రగ్స్ తీసుకోవడం వల్లనే అని అనుమానం కలుగుతోందని కొడాలి నాని అన్నారు. గత మూడు నెలల నుంచి లోకేశ్ ఎందుకు బయటికి రావడం లేదని నాని ప్రశ్నించారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేశ్ పై బాబుకు నమ్మకం పోయిందని, సొంత కొడుకు పార్టీని నడిపిస్తాడన్న భరోసా లేకపోవడంతో దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు చేతిలో పవన్ ఓ గంగిరెద్దు లాంటి వాడని విమర్శించారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా బడుగు వర్గాలకు అండగా ఉంటుందని, కానీ పవన్ మాత్రం కమ్మ వర్గానికే అండగా ఉంటున్నాడని మండిపడ్డారు.

TSRTC : దసరా పండుగ, ఆర్టీసీ బస్సుల్లో అదనపు చార్జీలు ఉండవ్

14ఏళ్లు సీఎంగా పని చేసినా ఇచ్చిన ఒక్కమాట కూడా నిలబెట్టుకోలేదని చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్‌ అయ్యారు. ‘‘పవన్‌ కల్యాణ్‌కు మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. చంద్రబాబు చేతిలో పవన్ గంగిరెద్దు. టీడీపీని జనసేనలో విలీనం చేయాలి. ఏ రాజకీయ పార్టీ అయినా బలహీన వర్గాలకు అండగా ఉంటుంది. పవన్‌ మాత్రం కమ్మ సామాజిక వర్గానికి అండగా ఉంటానంటున్నాడు. ‘డ్రగ్స్‌ వ్యవహారంలో చంద్రబాబు, కొంతమంది సన్నాసులు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మాఫియాతో సంబంధాలు ఉండేవి చంద్రబాబుకే. ఆయన హయాంలోనే ఉత్తరాంధ్ర నుంచి గంజాయి స్మగ్లింగ్‌ జరిగింది’ అని కొడాలి నాని ఆరోపించారు.

జగన్ ఉన్నంతకాలం రాష్ట్రానికి సీఎంగా ఆయనే ఉంటారని మంత్రి జోస్యం చెప్పారు. చంద్రబాబు, పవన్ కలసి నాటకాలు ఆడుతున్నారనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. రాష్ట్ర ప్రజలు జనసేన, టీడీపీని భూస్థాపితం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కొడాలి నాని అన్నారు.