Nara Lokesh: రెడ్ బుక్ చాప్టర్ 3 మామూలుగా ఉండదు: నారా లోకేశ్ హాట్ కామెంట్స్
రెడ్ బుక్‌కి భయపడుతున్న వైఎస్ జగన్.. గుడ్ బుక్ తీసుకువస్తానంటున్నారని లోకేశ్ తెలిపారు.

రెడ్ బుక్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి ఏపీకి బయలుదేరే ముందు లోకేశ్ మాట్లాడుతూ.. రెడ్ బుక్‌లో ఇప్పటికే రెండు చాప్టర్లు ఓపెన్ అయ్యాయని, ఇక త్వరలోనే మూడో చాప్టర్ తెరుస్తానని తెలిపారు. రెడ్ బుక్ చాప్టర్ 3 మామూలుగా ఉండదని అన్నారు.
ఈ మూడో చాప్టర్ ఓపెన్ కావడానికి ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు చాలా కష్టపడాలని అన్నారు. రెడ్ బుక్‌కి భయపడుతున్న వైఎస్ జగన్.. గుడ్ బుక్ తీసుకువస్తానంటున్నారని తెలిపారు. అయితే, అందులో ఏం రాయాలో ఆయనకు అర్థం కావడం లేదంటూ చురకలు అంటించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి తప్పకుండా సినిమా చూపిస్తామని చెప్పారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను కూడా ఒక బాధితుడినేనని తెలిపారు. యవగళం పాదయాత్ర సమయంలో తనను ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. అప్పట్లో తాను గన్నవరం సభలో పలు హామీలు ఇచ్చానని తెలిపారు. వాటిని నెరవేర్చుతామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాన్ని కలుపుకుని వెళ్తేనే ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళుతుందని చెప్పారు. ఏపీ ప్రజలు తమపై బాధ్యత పెట్టారన్న విషయాన్ని ఎమ్మెల్యేలు గుర్తుంచుకోవాలని అన్నారు.
టీటీడీపీపై దృష్టి సారించిన చంద్రబాబు.. టీటీడీపీ అధ్యక్షుడిగా బాబూమోహన్?