Perni Nani: పెట్రోల్ పై రూ.5 తగ్గించి పెద్ద బిల్డప్ కొడుతున్నారు, దమ్ముంటే ఢిల్లీలో చేయండి
పెట్రో ధరల అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. కేంద్రం పెట్రో ధరలు తగ్గించినట్టే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ధరలు తగ్గించాలని విపక్షాలు(టీడీపీ, బీజేపీ) డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్య

Perni Nani
Perni Nani: పెట్రో ధరల అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. కేంద్రం పెట్రో ధరలు తగ్గించినట్టే రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ధరలు తగ్గించాలని విపక్షాలు(టీడీపీ, బీజేపీ) డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో టీడీపీ మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపిచ్చింది. మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతలు సైతం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. మాటల యుద్ధానికి దిగారు. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం సైతం ఎదురుదాడికి దిగింది. మంత్రులు, వైసీపీ నేతలు.. ప్రతిపక్షాల విమర్శలకు ఘాటుగా రిప్లయ్ ఇస్తున్నారు. తాజాగా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు.
పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచిన వాళ్లే రోడ్లపై ధర్నాలు చేస్తారా? అని మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. పెట్రోల్ ధరను రూ.116 వరకు తీసుకెళ్లింది ఎవరు అని ప్రశ్నించారు. రూ.70 ఉండాల్సిన పెట్రోల్ ధరను ఎక్కడికో తీసుకెళ్లారని ధ్వజమెత్తారు. లీటరు 70 రూపాయలు ఉన్న పెట్రోల్ ధరను 110 రూపాయలకి తీసుకెళ్లిన ఘనత కేంద్రానిదే అన్నారు మంత్రి పేర్నినాని. రాకెట్ కంటే వేగంగా ఇంధన ధరలు పెరుగుతుంటే 5 రూపాయలు తగ్గించి గొప్పలు చెప్పడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు రాసిచ్చింది కాదు, దమ్ముంటే రాష్ట్ర బీజేపీ నేతలు పెట్రోల్ ధరలపై కేంద్రాన్ని నిలదీయాలన్నారు మంత్రి పేర్నినాని.
Whatsapp: ఫెంటాస్టిక్ ఫీచర్.. వాట్సప్‌లో మెసేజ్ ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు
”ధరలు పెంచిన వేగంతో ధరలను తగ్గించలేదు. నామమాత్రంగా ధరలను తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను తగ్గించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. పెట్రోల్ ధరను వంద రూపాయలు దాటించిన ఘనత బీజేపీదే. ప్రజలపై జాలి, దయ లేకుండా పెట్రోల్, డీజీల్ ధరలను పెంచారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరల విషయం ప్రజలకు తెలియదనే భ్రమలో బీజేపీ నేతలున్నారన్నారు.
పెట్రోల్, డీజీల్ పై రూ.5 కాదు, రూ.25 తగ్గించాలని బీజేపీ నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేయాలి. రోడ్డు సెస్ రూపంలో పెట్రోల్, డీజీల్ పై కేంద్ర ప్రభుత్వం రూ.2.85 లక్షల కోట్లు వసూలు చేస్తోంది. ఇంధన ధరలను తగ్గించాలని బీజేపీ నేతలు ఢిల్లీలో ధర్నా చేస్తే మేము కూడా వస్తాం” అని మంత్రి పేర్ని నాని అన్నారు.
రూ.70 ఉన్న లీటర్ పెట్రోల్ ధరను రూ. 110కు తీసుకెళ్లారు. అక్టోబర్ నెలలో లీటర్ పెట్రోల్, డీజీల్ ధర ఎంతుంది? ఇప్పుడు ఎంతుంది? అని బీజేపీ నేతలను మంత్రి ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ది చెప్పారని, అందుకే పెట్రోల్ పై రూ.5 తగ్గించి, ధరలు తగ్గించామని ఫోజులు కొడుతున్నారని మంత్రి నాని మండిపడ్డారు. ఉప ఎన్నికల ఫలితాలతో కేంద్రం కళ్లు తెరిచిందన్నారు. పెట్రోల్, డీజీల్ ధరలను విపరీతంగా పెంచి నామ మాత్రంగా ధరలను తగ్గించి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
FB Own Survey : ఫేస్‌బుక్‌తో 36 కోట్ల మందికి రిస్క్!
దేశంలోని 14 రాష్ట్రాల్లో పెట్రోల్, డీజీల్ ధరలు ఎందుకు తగ్గించలేదని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్న సమయంలో పెట్రోల్, డీజీల్ పై పన్నుల భారం వేసిన చంద్రబాబు ఇవాళ ధరల పెరుగుదల గురించి మాట్లాడడాన్ని మంత్రి తప్పుబట్టారు. ఈ నెల 9న పెట్రోల్ బంకుల దగ్గర ఆందోళనలు చేయడానికి చంద్రబాబుకి ఏం హక్కు ఉందని మంత్రి ప్రశ్నించారు. తమ ప్రభుత్వంపై బురదచల్లేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు.
ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని మంత్రి ప్రశ్నించారు. వరుస ఎన్నికల్లో తమ పార్టీకి వస్తున్న ఫలితాలే ప్రజాదరణకు నిదర్శనమని మంత్రి పేర్నినాని అన్నారు.
”గడిచిన ఏడేళ్లలో బీజేపీ ప్రభుత్వం శ్రీహరికోట రాకెట్ లా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. 70 రూపాయలు ఉన్న పెట్రోల్ ని 118 రూపాయలు దాటించారు. ప్రజలపై జాలి, దయ లేకుండా ధరలు పెంచిన ఘనులు బీజేపీ పెద్దలు. 5, 10 రూపాయలు తగ్గించి పెద్ద ఘనకార్యం చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు. పెట్రోల్. డీజిల్ తగ్గించాలని ధర్నాలు చేస్తున్న బీజేపీ నేతలకు సిగ్గుండాలి. రోడ్ల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం ఒక్క రూపాయి సెస్ వసూలు చేస్తోంది. ఎక్సైజ్ డ్యూటీలోని శాతాన్ని మాత్రమే కేంద్రం తగ్గించింది. 2.87,500 కోట్ల సెస్ వసూల్ చేస్తున్న కేంద్రం.. దీంట్లో పైసా కూడా తగ్గించ లేదు.
రాష్ట్ర బీజేపీ నేతలకు నిజాయితీ ఉంటే ఢిల్లీ నార్త్ బ్లాక్ దగ్గర ధర్నా చెయ్యండి. రూ.25 తగ్గించమని మోడీని అడగండి. నిబద్ధత ఉంటే బీజేపీ ధర్నా పెట్టాలి.. మేము కూడా ఢిల్లీ వస్తాం.. కలిసి అడుగుదాం. గ్యాస్ బండ ధరలు ఎక్కడికి తీసుకుని వెళ్లారో బీజేపీ నేతలకు తెలియడం లేదా..? ప్రతీ ఇంటికి నిత్యావసరంగా ఉన్న గ్యాస్ ఇష్టానుసారంగా పెంచి మహిళల ఉసురు పోసుకోవడం లేదా..? ఇక్కడ చంద్రబాబు రాసిచ్చిన ఉపన్యాసాలు దంచడం కాదు.. కేంద్రాన్ని అడగండి. రాష్ట్రం నుండి వసూలు చేస్తున్న పన్నులు ఏ విధంగా ఖర్చు చేస్తున్నారో బీజేపీ నేతలు చెప్పండి. 2015 నుండి చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు వసూలు చేసి.. ఇప్పుడు సృహ లేకుండా ధర్నాలు అంటున్నాడు.
అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశాడో ప్రజలకు తెలియదు అనుకుంటున్నాడా..? ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలో తప్పు ఏంటి..? కేంద్రం ఏ విధంగా ధరలు పెంచిందో.. లెక్కలతో సహా ప్రజలకు చెప్తే తప్పా.. కేంద్రం విపరీతంగా రేట్లు పెంచడం వాస్తవం కాదా..? చంద్రబాబు 31 శాతం వసూలు చేసింది అవాస్తవమా..? ప్రజలకు వాస్తవాలు చెప్పడం ప్రభుత్వం బాధ్యత” అని మంత్రి పేర్ని నాని అన్నారు.