Guntur Crime : రోజా క్షమాపణలు చెప్పాలి.. చీర పంపిస్తే తల్లికి ఇస్తా – నారా లోకేశ్

రాళ్ల దాడికి పాల్పడడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో.. ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి.. వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇటీవలే మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను...

Guntur Crime : రోజా క్షమాపణలు చెప్పాలి.. చీర పంపిస్తే తల్లికి ఇస్తా – నారా లోకేశ్

Roja Vs Lokesh

Updated On : April 28, 2022 / 7:03 PM IST

Nara Lokesh : ఏపీ రాష్ట్ర మంత్రి రోజా.. బహిరంగంగా మహిళలకు క్షమాపణలు చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ డిమాండ్ చేశారు. మంత్రిగా ఉండి.. సాటి మహిళ అయి.. చీరలపై వ్యాఖ్యలు చేయడం మహిళలను కించపరచడమేనని తెలిపారు. చీరలు కట్టుకున్న మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతారా ? తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లాలో రెండు ఘటనలు జరిగాయని.. ఈ ఘటనలు మహిళా కమిషన్ ఛైర్మన్ కు కనిపించవా ? ప్రశ్నిస్తే నోటీసులు పంపిస్తారా ? ప్రశ్నించారు. 2022, ఏప్రిల్ 28వ తేదీ గురువారం నారా లోకేశ్ తుమ్మపూడికి వచ్చారు. ఈ ప్రాంతంలో ఓ మహిళ దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు.

Read More : Guntur : తుమ్మపూడిలో మహిళ హత్య.. సర్కార్‌‌కు లోకేశ్‌ డెడ్ లైన్

ఆయన పర్యటనను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. రాళ్ల దాడికి పాల్పడడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో.. ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి.. వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇటీవలే మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా నారా లోకేశ్ ప్రస్తావించారు. చీర పంపిస్తే తన తల్లికి ఇస్తానని.. మొత్తం మహిళ సమాజానికి ఆమె క్షమాపణలు చెప్పాలన్నారు. ఆడవాళ్లను కించపరిచే విధంగా మంత్రులు శాసనమండలిలో మాట్లాడరని, శాసనసభలో తన తల్లిని అవమానించినట్లు చెప్పారు. మహిళా మంత్రి అయి ఉండి.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు అన్నారు.

Read More : Nara Lokesh: తెనాలిలో ఉద్రిక్తత.. రూప మృతదేహం తరలింపు

ఇటీవలే మంత్రి రోజా టీడీపీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రాన్ని అభివృద్ధిని నడిపిస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని.. ఆయన్ను విమర్శిస్తే సహించలేమన్నారు. పార్టీ పెట్టుకోలేని, సొంతంగా ఎన్నికలకు పోలేని చంద్రబాబు నాయుడుకు చీర.. చుడీదార్ కావాలో ఆలోచించుకోవాల్సింది ఆయనేనని.. తాము కాదన్నారు. డ్వాక్రా సంఘాలకు 14 వేల 500 ఎగ్గొట్టారని.. వాళ్లు చీరలు పంపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నారా లోకేశ్ ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడని, పచ్చ చీర, పసుపు చీరలు పంపిస్తామన్నారు. నారా లోకేష్ చేసిన కామెంట్స్ పై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.