Guntur : తుమ్మపూడిలో మహిళ హత్య.. సర్కార్‌‌కు లోకేశ్‌ డెడ్ లైన్

తుమ్మపూడిలో హత్యకు గురైన మహిళ కేసులో నిందితులకు ఉరి శిక్ష వేయాలని.. 21 రోజుల టైం ఇస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్సీ, జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు.

Guntur : తుమ్మపూడిలో మహిళ హత్య.. సర్కార్‌‌కు లోకేశ్‌ డెడ్ లైన్

Guntur Tdp

Nara Lokesh Tour in Tenali : గుంటూరు జిల్లా తుమ్మపూడిలో హత్యకు గురైన మహిళ కేసులో నిందితులకు ఉరి శిక్ష వేయాలని.. 21 రోజుల టైం ఇస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్సీ, జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. హత్యకు గురైన మహిళ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఆయన్ను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఒక్కసారిగా రాళ్లు పడడంతో టెన్షన్ ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు నారా లోకేశ్. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Read More : Nara Lokesh: తెనాలిలో ఉద్రిక్తత.. రూప మృతదేహం తరలింపు

తిరుపతిలో మహిళపై గ్యాంగ్ రేప్ చేసి అత్యంత దారుణంగా చంపేశారని, భర్తతో తాను మాట్లాడినట్లు తెలిపారు. 24 గంటలు జరిగినా పోస్టుమార్టం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. దాడిలో ముగ్గురి పాత్ర ఉందని.. వీరి పేర్లు పెట్టాలని బాధిత కూతురు చెప్పినా నిర్లక్ష్యం వ్యవహరించారని ఆరోపించారు. కుటుంబానికి అండగా నిలబడుదామని వచ్చినట్లు.. పార్టీ తరపున రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని, కూతురిని చదివిస్తానని హామీనివ్వడం జరిగిందన్నారు. బుధవారం దాడి జరిగితే.. రెండు, మూడు గంటల పాటు బాధిత మహిళా భర్తను కూర్చొబెట్టారని, ఈ ఘటనలో ఎవరెవరు ఉన్నారో బయటకు రావాలని డిమాండ్ చేశారు. పార్టీలకతీతంగా దర్యాప్తు జరిపించాలని, ముగ్గురి పేర్లు చెబితే.. ఒక పేరు ఎందుకు తీసేశారు ? ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి ? అని ప్రశ్నించారు.

Read More : nara lokesh: ఏపీలో మాఫియా రాజ్ పాలన: నారా లోకేష్

చట్టాలపై భయం, గౌరవం ఉండాలని, ఏపీలో మాఫియా రాజ్ విచ్చవిడిగా నడుస్తోందని మండిపడ్డారు. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి 1000 రోజులు దాటిందని.. ఇప్పటి వరకు 800 మంది మహిళలపై దాడులు జరిగాయని చెప్పారు. గతంలో గుంటూరులో రమ్య, నరసరావుపేటలో అనూష, కర్నూలులో ఓ మైనార్టీ మహిళపై.. ఇలాంటి దారుణాలు ఎన్నో జరిగాయని తెలిపారు. ఎన్నికలకు ముందు.. ఎన్నో విషయాలు చెప్పారని.. ఏదీ జగన్.. ఎక్కడ జగన్ అని ప్రశ్నించారు. తన సొంత నియోజకవర్గంలో ఘటన జరగడం.. అప్పటి వరకు పోస్టుమార్టం నిర్వహించలేదన్నారు. తాను రావడంతో.. పోస్టుమార్టం నిర్వహించారని, భర్తను కనీసం కారు ఎక్కించకుండా.. మృతదేహాన్ని ఎక్కడ తరలిస్తున్నారనే విషయం తెలియదన్నారు.

Read More : Nara Lokesh: జ‌గ‌న్‌రెడ్డి మాట ఇచ్చాడంటే, దానికి రివ‌ర్స్ చేస్తాడంతే!: నారా లోకేష్

దిశ చట్టం ఉన్నదని వక్రీకరించి.. ఎక్కడా కూడా యాక్షన్ జరగలేదని, రమ్యపై దాడి జరిగితే.. నిందితుడిని శిక్షిస్తామని చెప్పారని తెలిపారు. కానీ.. నిందితుడు ఇప్పుడు రోడ్డుపై తిరుగుతున్నాడన్నారు. తాను బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తే.. రాళ్లతో దాడులు చేస్తారా ? అని ఫైర్ అయ్యారు. రాళ్లు విసిరితే పారిపోతామా ? పోలీసులు వారిని నివారించలేరా ? అంటూ ప్రశ్నించారు. తనపై 12 కేసులు పెట్టినా..భయపడమని చెప్పారు.