Nara Lokesh: తెనాలిలో ఉద్రిక్తత.. రూప మృతదేహం తరలింపు

ఆంధ్రప్రదేశ్, తెనాలిలో ఉద్రిక్తత నెలకొంది. వేమూరు నియోజకవర్గంలో హత్యకు గురైన రూపా శ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తెనాలి ఆసుపత్రికి నారా లోకేష్ వస్తుండటంతో, ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Nara Lokesh: తెనాలిలో ఉద్రిక్తత.. రూప మృతదేహం తరలింపు

Nara Lokesh

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్, తెనాలిలో ఉద్రిక్తత నెలకొంది. వేమూరు నియోజకవర్గంలో హత్యకు గురైన రూపా శ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తెనాలి ఆసుపత్రికి నారా లోకేష్ వస్తుండటంతో, ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చిలుమూరు గ్రామానికి చెందిన దళిత మహిళ రూప శ్రీ బుధవారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. పోస్టుమార్టం నిమిత్తం రూప మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. ఇప్పటికే అక్కడికి టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు చేరుకుని, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Andhra pradesh: వైద్యం వికటించి బాలింత మృతి

గతంలో రూప, తనకున్న ఇబ్బందులపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో నిందితులపై చర్యలు తీసుకోలేదని రూప కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో వైసీపీ నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రూప కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నారా లోకేష్ తెనాలి బయలుదేరారు. లోకేష్ వస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు, రూప మృతదేహాన్ని ఆమె స్వగ్రామానికి తరలించారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. అప్పటికే నారా లోకేష్ హాస్పిటల్‌కు చేరుకోవడంతో మరోసారి ఉద్రిక్తత పెరిగింది. అయితే, రూప మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్తారా.. లేక నేరుగా అంత్యక్రియలు నిర్వహిస్తారా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, వైసీపీ నేతల తీరును టీడీపీ నాయకులు తప్పుబడుతున్నారు.