nara lokesh: ఏపీలో మాఫియా రాజ్ పాలన: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో మాఫియా రాజ్ పాలన నడుస్తోందని, ఎక్కడ చూసినా మాఫియా రాజ్ అరాచకాలే కనిపిస్తున్నాయని విమర్శించారు టీడీపీ నేత నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గం, తాడేపల్లి రూరల్, వడ్డేశ్వరం గ్రామంలో పర్యటించిన లోకేష్, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

nara lokesh: ఏపీలో మాఫియా రాజ్ పాలన: నారా లోకేష్

Nara Lokesh

nara lokesh: ఆంధ్రప్రదేశ్‌లో మాఫియా రాజ్ పాలన నడుస్తోందని, ఎక్కడ చూసినా మాఫియా రాజ్ అరాచకాలే కనిపిస్తున్నాయని విమర్శించారు టీడీపీ నేత నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గం, తాడేపల్లి రూరల్, వడ్డేశ్వరం గ్రామంలో పర్యటించిన లోకేష్, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు 70 ఎంఎం సినిమా చూపించిన సీఎం, ఇప్పుడు జగన్ మోసపు రెడ్డిగా మారిపోయాడన్నారు.

Ruia RMO Suspended : తిరుపతి రుయా ఘటన.. ఆర్ఎంవో సస్పెండ్, ఆ నలుగురిపై క్రిమినల్ కేసులు

‘‘సీఎం కాన్వాయ్ కోసం కుటుంబాన్ని నడిరోడ్డు మీద ఆపి కారు తీసుకెళ్లారు. పిల్లలు ఆడుకుంటూ ఫ్లెక్సీ చింపేతే పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో పెట్టి వేధించారు. రుయా ఆసపత్రిలో చనిపోయిన బిడ్డ మృతదేహాన్ని తరలించడానికి రూ.20 వేలు అడిగింది అంబులెన్స్ మాఫియా. ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్ రెడ్డి మాఫియా రాజ్ అరాచకాలే కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో యువతిపై సామూహిక అత్యాచారం జరిగితే, పరామర్శకు వెళ్లిన చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన యువతిని, కుటుంబాన్ని పరార్శించడం కూడా నేరమేనా? మరి జగన్ రెడ్డి పాలనలో 800 అత్యాచారాలు జరిగినప్పుడు మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదు? ప్రభుత్వానికి, జగన్ రెడ్డికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? రమ్య, అనూష, బేగం బీ లను చంపిన వాళ్ళు రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు. హోంమంత్రికి కనీసం ఘటన ఎప్పుడు జరిగిందో తెలియకపోవడం దురదృష్టకరం.

Ruia Ambulance Mafia : రుయాలో అంబులెన్స్‌ మాఫియా ఆగడాలు.. 90కి.మీ బైక్‌పైనే కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లిన తండ్రి

ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి… ఎన్నికల తరువాత జగన్ రెడ్డి ఒక్కరేనా అనే అనుమానం కలుగుతోంది. ఉపాధ్యాయులను టెర్రరిస్టుల్లా ట్రీట్ చెయ్యడం దారుణం. విద్యుత్ ధరలు తగ్గిస్తానని హామీ ఇచ్చిన జగన్ మోసపు రెడ్డి భారీగా ఛార్జీలు పెంచి దోచుకుంటున్నారు. అరగంట మంత్రి పోయి, ఇప్పుడు గంట మంత్రి వచ్చారు. గంట మంత్రికి అహంకారం నెత్తికెక్కి మీడియాపై చిందులు వేస్తున్నారు. 2021కి పోలవరం పూర్తి చేస్తామన్నారు. తర్వాత 2022 అన్నారు. ఇప్పుడేమో 2023లో పోలవరం పూర్తి చేస్తామంటున్నారు. డయాఫ్రం వాల్ లోపల ఉంటుందో, బయట ఉంటుందో తెలియని, ఏ ప్రాజెక్ట్ ఏ నది పై కడుతున్నారో అవగాహన లేని వ్యక్తి మంత్రి అయ్యారు’’ అని విమర్శించారు. వడ్డేశ్వరం గ్రామంలో ప్రజలకు జగనన్న బాదుడే బాదుడు, విద్యుత్ కోతలకు నిరసగనా విసనకర్ర, కొవ్వొత్తి, అగ్గిపెట్టె పంపిణీ చేశారు.