తన కులం కోసమే చంద్రబాబు అమరావతి రాజధాని ప్లాన్.. మేం ఎందుకు ఒప్పుకోవాలి..? : మంత్రి సీధిరి అప్పలరాజు

ఉత్తరాంధ్ర ప్రజలు మేల్కోవాల్సిన సమయం ఇది. రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.

తన కులం కోసమే చంద్రబాబు అమరావతి రాజధాని ప్లాన్.. మేం ఎందుకు ఒప్పుకోవాలి..? : మంత్రి సీధిరి అప్పలరాజు

Seediri Appalaraju

Minister Seedhiri Appalaraju : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి సీధిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు చంద్రబాబు ఏం చేసారో ఈరోజు పలాస సభలో చెప్పాలని అప్పలరాజు డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర వలస నివారణకు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. పాదయాత్రలో ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలు జగన్ చూశారని, అందుకే విశాఖను ఎగ్జిక్యుటివ్ క్యాపిటల్ గా చేయాలనుకున్నారని చెప్పారు.

Also Raed : CM Jagan : సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడికేసులో విచారణ వేగవంతం.. మరో 16టీంలు ఏర్పాటు

అమరావతి రియల్ ఎస్టేట్ లే అవుట్. తన కులంకోసమే అమరావతి రాజధానిని చంద్రబాబు ప్లాన్ చేశాడు. చంద్రబాబు సామాజిక వర్గం ఆధిపత్యంలోనే అమరావతి రాజధాని ఉండాలని ప్లాన్ చేశారు. మేం ఎందుకు దాన్ని ఒప్పుకోవాలి? మా విశాఖకు ఏం తక్కువ? ఇక్కడ రాజధాని పెడితే ఉత్తరాంధ్ర ప్రజలు అభివృద్ధి జరుగుతుంది కదా.. దీనికి ఎందుకు చంద్రబాబు ఒప్పుకోవడం లేదని సీధిరి అప్పలరాజు ప్రశ్నించారు.

Also Read : దాడి జరిగిన తర్వాత అందుకే జగన్ బస్సు యాత్ర ఆపలేదు: ఎమ్మెల్యే వెలంపల్లి

ఉత్తరాంధ్రకు మంచి జరుగుతుంటే ఎందుకు ఒప్పుకోరు చంద్రబాబు అంటూ అప్పలరాజు ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజలు మేల్కోవాల్సిన సమయం ఇది. రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. చంద్రబాబు ముఠా.. ఉత్తరాంధ్ర కలలను కాలరాసే కుట్ర చేస్తున్నారు. జగన్ ఉత్తరాంధ్రలో రాజధాని ఏర్పాటుచేసి అభివృద్ధి చేయాలని చూస్తున్నారని మంత్రి సీధిరి అప్పలరాజు అన్నారు.