దాడి జరిగిన తర్వాత అందుకే జగన్ బస్సు యాత్ర ఆపలేదు: ఎమ్మెల్యే వెలంపల్లి

Vellampalli Srinivas: జగన్ పై ఎవరైనా ఆరోపణలు చేస్తే నాశనం అయిపోతారని వెల్లంపల్లి చెప్పారు.

దాడి జరిగిన తర్వాత అందుకే జగన్ బస్సు యాత్ర ఆపలేదు: ఎమ్మెల్యే వెలంపల్లి

Vellampalli Srinivas

Updated On : April 14, 2024 / 3:37 PM IST

దాడి జరిగిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రజల కోసమే బస్సు యాత్ర ఆపలేదని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. డాక్టర్లు వద్దని వారిస్తున్నప్పటికీ జగన్ వినలేదని, జగన్ అంటే ఇదని చెప్పారు. 10టీవీలో వెల్లంపల్లి ఇవాళ మాట్లాడుతూ.. చంద్రబాబులా ఆరోగ్యం బాలేదని జగన్ వంకలు చెప్పలేదని తెలిపారు.

జగన్ పై ఎవరైనా ఆరోపణలు చేస్తే నాశనం అయిపోతారని వెల్లంపల్లి చెప్పారు. దీనిపై ఎన్నికల సంఘం స్పందించాలని అన్నారు. వెన్నుపోటుదారులను తరిమి కొట్టాలని చెప్పారు. జగన్ పై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని అన్నారు. దీని వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపించారు. రెక్కీ నిర్వహించి దాడి చేశారని చెప్పారు. చంద్రబాబు హస్తం ఉందని తెలిపారు.

జగన్ కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, దాడులు చేయిస్తున్నారని వెల్లంపల్లి చెప్పారు. జగన్ ప్రజల మనిషిని అన్నారు. నారా లోకేశ్, అచ్చెన్నాయుడు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. చంద్రబాబులా ఆరోగ్యం బాలేదని జగన్ వంకలు చెప్పలేదని తెలిపారు.

Also Read: జగన్‌పై జరిగిన దాడి ఘటనపై నివేదిక.. 20 మందితో 6 బృందాలు ఏర్పాటు