జగన్‌పై జరిగిన దాడి ఘటనపై నివేదిక.. 20 మందితో 6 బృందాలు ఏర్పాటు

స్కూల్, టెంపుల్ మధ్య బహిరంగ ప్రాంతం నుంచి దాడి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు.

జగన్‌పై జరిగిన దాడి ఘటనపై నివేదిక.. 20 మందితో 6 బృందాలు ఏర్పాటు

Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడి ఘటనపై ఎన్నికల సంఘానికి విజయవాడ సీపీ కాంతి రాణా నివేదిక ఇచ్చారు. దర్యాప్తు చేసేందుకు 20 మందితో 6 బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హత్యాయత్నం, నాన్ బెయిలబుల్ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

స్కూల్, టెంపుల్ మధ్య బహిరంగ ప్రాంతం నుంచి దాడి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు. ఒక రాయితో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా సీపీ కూడా దాడి ఘటనపై ఈసీకి రిపోర్ట్ ఇచ్చారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందన్నారు.

దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం వివరాలు కోరింది. వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై ఈసీఐ అరా తీస్తోంది. చిలకలూరిపేట ప్రధాని మోదీ సభ, ఇప్పుడు సీఎం రోడ్ షోలో భద్రతా వైఫల్యాలేంటని ప్రశ్నించింది. దాడి ఘటనతో రాజకీయ హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై ఇప్పటికే ఓ ఐజీ, ఓ జిల్లా ఎస్పీపై బదిలీ వేటు పడింది. అయినప్పటికీ ఏపీ పోలీసుల తీరు మారలేదు.

 Also Read: ఆకతాయిగా విసిరిన రాయి కాదు.. జగన్ పై దాడి ఘటన గురించి సజ్జల కీలక వ్యాఖ్యలు