Monditoka Jagan Mohan Rao : అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పని చేస్తా : ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు

అభివృద్ధి నిధుల కోసం కచ్చితంగా కేశినేని నానితో మాట్లాడతానని డాక్టర్ జగన్ మోహన్ రావు పేర్కొన్నారు. తాను అందరినీ పలకరిస్తాను, అందరినీ గౌరవిస్తానని చెప్పారు.

Monditoka Jagan Mohan Rao : అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పని చేస్తా : ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు

Monditoka Jagan Mohan Rao

Updated On : May 23, 2023 / 1:02 PM IST

MLA Dr. Monditoka Jagan Mohan Rao said that development of Nandigama constituency is important to him

నందిగామ నియోజకవర్గ అభివృద్ధే తనకు ముఖ్యమని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు అన్నారు. అభివృద్ధి కోసం ఎవరితోనైనా కలిసి పని చేస్తానని తెలిపారు. కేశినేని నాని మంచిని మంచి అని చెబితే కొంతమందికి కడుపు మంటగా ఉందన్నారు.‌ తాము చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసన్నారు. నందిగామ నియోజకవర్గ ప్రజలు తనను ఎమ్మెల్యేగా, కేశినేని నానిని ఎంపీగా ఎన్నుకున్నారని.. అభివృద్ధి చేయటం ఇద్దరి బాధ్యతని డాక్టర్ జగన్ మోహన్ రావు తెలిపారు.

తమను వసూలు బ్రదర్స్ అని విమర్శలు చేసేవాళ్లు.. తాము ఎవరి దగ్గర వసూలు చేసామో చెప్పాలని నిలదీశారు. ఏదైనా మాట్లాడితే ఆధారాలతో మాట్లాడాలని, దిగజారి విమర్శలు చేసే వారికి తాను సమాధానం చెప్పనని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘నందమూరి తారక రామారావు అందరివాడు.. ఆయన్ని కేవలం మావాడు అని కొంతమంది అనుకుంటే ఆయన్ని చిన్నగా చేసినట్లే’ అని అన్నారు.

Anjaneyulu: మాకు ప్రాణహాని ఉంది.. ఏదైనా జరిగితే అందుకు కారణం బాలినేని వియ్యంకుడు భాస్కర్ రెడ్డే

ప్రజలకు సేవ చేసిన వారిని జనం మర్చిపోరు.. ప్రజలకు సేవ చేస్తే మరలా తిరిగి గెలిపిస్తారు అని పేర్కొన్నారు. నందిగామ నియోజకవర్గంలో ప్రోటోకాల్ ప్రకారం పనిచేయాలని, పార్టీలకు అతీతంగా ప్రోటోకాల్ ప్రకారం అందరిని ఆహ్వానించాలని, సమాచారం ఇవ్వాలని తాను అధికారులకు చెబుతానని వెల్లడించారు. కేశినేని నాని ఎంపీగా నియోజకవర్గంలో టాటా ట్రస్ట్ సేవలు అందించారని, కంచికచర్ల, నందిగామ బైపాస్ రోడ్ల నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారని పేర్కొన్నారు.

కేశినేని నాని చేసిన మంచిని మంచి అనే చెబుతామని పేర్కొన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినంతవరకు తాను ఎవరితోనైనా కలిసి వెళతానని చెప్పారు. పనిచేయమని తనకు ప్రజలు అవకాశం ఇచ్చారని, పనికిమాలిన విమర్శలు పట్టించుకోనని తెలిపారు. కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకతీతంగా అభివృద్ధి చేయమని, అందరికీ మంచి చేయమని చెప్పే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు.

Giriraj Singh : ముస్లింలను అప్పుడే పాకిస్థాన్‌కు పంపించేసి ఉండాల్సింది : కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

అభివృద్ధి నిధుల కోసం కచ్చితంగా కేశినేని నానితో మాట్లాడతానని డాక్టర్ జగన్ మోహన్ రావు పేర్కొన్నారు. తాను అందరినీ పలకరిస్తాను, అందరినీ గౌరవిస్తానని చెప్పారు. అసెంబ్లీలో చంద్రబాబు ఎదురుపడినా నమస్కారం పెడతానని తెలిపారు. విమర్శలు వేరు.. గౌరవం వేరు ‌అని పేర్కొన్నారు. పార్టీలుగా విమర్శించినా.. వ్యక్తులుగా గౌరవిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు తెలిపారు.