MLA Ketireddy Peddareddy : నాపై అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదు.. నారా లోకేష్ కు ఎమ్మెల్యే కేతిరెడ్డి అల్టిమేటం

జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ చదివితే మాత్రం ఊరుకునేది లేదని ఎద్దేవా చేశారు. లోకేష్ క్యాంపు వద్దకు నేరుగా వెళ్లి తేల్చుకుంటానని వెల్లడించారు.

MLA Ketireddy Peddareddy : నాపై అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదు.. నారా లోకేష్ కు ఎమ్మెల్యే కేతిరెడ్డి అల్టిమేటం

Ketireddy Peddareddy

Updated On : April 9, 2023 / 2:08 PM IST

MLA Ketireddy Peddareddy : టీడీపీ నేత నారా లోకేష్ కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. తనపై అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తే లోకేష్ వద్దే తేల్చుకుంటానని చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ చదివితే మాత్రం ఊరుకునేది లేదని ఎద్దేవా చేశారు. లోకేష్ క్యాంపు వద్దకు నేరుగా వెళ్లి తేల్చుకుంటానని వెల్లడించారు.

జేసీ బ్రదర్స్ అరాచకాలపై తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లను ధ్వంసం చేసిన జేసీ బ్రదర్స్ కు లోకేష్ ఎందుకు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో 154 వాహనాలను జేసీ ట్రావెల్స్ అక్రమ రిజిస్ట్రేషన్ల చేయించిందని ఆరోపించారు. ‘మీ సామాజిక వర్గానికి చెందిన ప్రబోదానందస్వామి ఆశ్రమంపై దాడి చేయించారు’ అని పేర్కొన్నారు.

JC Prabhakar Reddy: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై మండిపడ్డ జేసి ప్రభాకర్ రెడ్డి

జేసీ బ్రదర్స్ అక్రమాలపై టీడీపీ నేతలు పోరాడిన సంగతి లోకేష్ కు గుర్తులేదా? అని నిలదీశారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్రను చంపింది జేసీ బ్రదర్స్ అని ఆరోపించారు. జేసీ ఫ్యామిలీతో పరిటాల కుటుంబం చెట్టాపట్టాలేసుకుని ఎలా తిరుగుతోందని ప్రశ్నించారు. పరిటాల హత్యకు ఉపయోగించిన ఆయుధాలు సరఫరా చేసింది ఎవరో అందరికీ తెలుసన్నారు.