Kodali Nani : 9 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవంగా వైసీపీకే- కొడాలి నాని జోస్యం
9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవంగా వైసీపీకే వస్తాయని సీఎం జగన్ అన్నారు. 3 పట్టభద్రులు, 2 టీచర్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు తప్పక గెలిచి తీరాలని సీఎం ఆదేశించారు.

Kodali Nani : వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో ఏపీ సీఎం జగన్ సమావేశం ముగిసింది. మార్చి 18 నుంచి మా భవిష్యత్ నువ్వే జగన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తయ్యాక సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్దిదారుల ఇళ్లకు మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లు అంటించనున్నారు గృహసారథులు. ఇక ఈ సమావేశంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పనితీరు సరిగా లేదంటూ పలువురు ఎమ్మెల్యేలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. పనితీరు సరిగా లేని 20 మంది ఎమ్మెల్యేల పేర్లు చదివి వినిపించారు జగన్.
ఈ సమావేశం అనంతరం ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు. టీడీపీ పుస్తకాలు పనికిమాలినవి అని ఫైర్ అయ్యారు. గతంలో చంద్రబాబు గ్రాఫిక్స్ తో ప్రజలను మభ్యపెట్టారని మండిపడ్డారు. రాష్ట్ర సంపదను కొంతమంది చంద్రబాబుకి దోచి పెట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ చెప్పారని కొడాలి నాని తెలిపారు.
Also Read..CM Jagan Serious : ఆ 20మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ సీరియస్
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అవకాశం ఉన్న చోట్ల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించాలని జగన్ ఆదేశించినట్లు కొడాలి నాని వెల్లడించారు. ఇక టీచర్లు ఎప్పుడూ ఒకవైపు ఉండరని, ఏదో ఒక పార్టీకి అనుబంధంగా టీచర్స్ యూనియన్ ఉంటుందన్నారు. విద్యావంతుల్లో ఏ పార్టీకి నూటికి నూరు శాతం ఓట్లు రావని తేల్చి చెప్పారు కొడాలి నాని.
Also Read..Chandrababu Naidu : జగన్ ఓటమి ఖాయం, ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
” 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవంగా వైసీపీకే వస్తాయని సీఎం జగన్ అన్నారు. 3 పట్టభద్రులు, 2 టీచర్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు తప్పక గెలిచి తీరాలని సీఎం ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నా పర్సెంటేజీ తక్కువగా ఉందని సీఎం చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని నన్ను సీఎం ఆదేశించారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు తప్పక గెలవాలన్నారు. మార్చి 18 నుంచి ”జగనన్నే మా భవిష్యత్తు” కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి అడ్డు కాదు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ చెప్పారు” అని కొడాలి నాని అన్నారు.