MLA Roja : టీచర్‌గా మారిన ఎమ్మెల్యే రోజా

వైసీపీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా కొత్త అవతారం ఎత్తారు. నిత్యం రాజకీయాలతో బిజీగా గడిపే ఆమె టీచర్ గా మారారు. క్లాస్ రూమ్ లోకి వెళ్లి

MLA Roja : టీచర్‌గా మారిన ఎమ్మెల్యే రోజా

Mla Roja

Updated On : August 28, 2021 / 7:22 PM IST

MLA Roja : వైసీపీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా కొత్త అవతారం ఎత్తారు. నిత్యం రాజకీయాలతో బిజీగా గడిపే ఆమె టీచర్ గా మారారు. క్లాస్ రూమ్ లోకి వెళ్లి విద్యార్థులకు బోధన చేశారు. చేతిలో పాఠ్య పుస్తకం పెట్టుకుని పాఠాలు చెప్పారు.

Bollywood Stars Bodyguards : అమితాబ్ నుంచి షారుక్ ఖాన్ వరకు.. బాడీగార్డులకు కోట్లు చెల్లిస్తున్న స్టార్స్

నిండ్ర మండలం అత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పారు. తొమ్మిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో “భూమి – మనం” అనే పాఠ్యాంశంను తీసుకొని పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత, పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలను విద్యార్థులకు వివరించారు. ఆ తర్వాత ప్రశ్నలు వేసి పిల్లల నుంచి సమాధానాలు కూడా రాబట్టారు.

Model Kazumi : సరిగా కూర్చోలేదు, అయినా నెలకు కోటి రూపాయలు సంపాదిస్తోంది