బాబుగారూ.. అమరావతి రాజధాని కావాలంటే ఈ పని చేయండి

చంద్రబాబు, టీడీపీపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. రాజధాని అంశంపై చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం చంద్రబాబుకి ఇష్టం లేదన్నారు. అందుకే పరిపాలన వికేంద్రీకరణకు అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. రాజధాని అమరావతిలో ఏదో జరిగిపోతోందని చిత్రీకరిస్తున్నారని చంద్రబాబుపై సీరియస్ అయ్యారు.
వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని చంద్రబాబు అంటున్నారు.. రాజీనామా చేయాల్సింది మేము కాదు.. టీడీపీ ఎమ్మెల్యేలే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, ప్రజలు ఏ తీర్పు ఇస్తారో తెలుస్తుందని రోజా అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా వైసీపీని గెలిపించారని రోజా చెప్పారు. అమరాతి రాజధాని కావాలంటే టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనా చేయాల్సిందే అని రోజా స్పష్టం చేశారు.
చంద్రబాబు తీరుపై రోజా ఫైర్:
* రాజధానిలో ఏదో జరిగిపోతుందని చంద్రబాబు చిత్రీకరిస్తున్నారు
* ఓటుకు నోటు కేసులో దొరికిపోయి చంద్రబాబు పారిపోయి వచ్చారు
* వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని చంద్రబాబు అంటున్నారు
* గత ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా వైసీపీని గెలిపించారు
* టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయండి
* ప్రజలు ఏ తీర్పు ఇస్తారో తెలుస్తుంది
* లోకేష్ ను మంగళగిరి ఓటర్లు మట్టికరింపించారు
* ఐదేళ్లలో అమరావతిలో ఏం చేశారు
* రైతులు ముసుగులో డ్రామాలు ఆడుతున్నారు
* చంద్రబాబు 2020 అంటే 20 ఎమ్మెల్యేలు, 20 గ్రామాలు
* రాజధాని నిర్మాణానికి లక్షా 10వేల కోట్లు అవసరమవుతాయని చంద్రబాబే చెప్పారు
* ఇప్పుడు.. 2వేల కోట్లతో పూర్తవుతుందని చెబుతున్నారు
* చంద్రబాబుది రియల్ ఎస్టేట్ డ్రామా
* రాజధానిలో లోకేష్ ను పప్పు అని ఊరికే అనలేదు
* రాజధానిలో కనీసం బాత్ రూమ్ కూడా కట్టలేదు
* కనీసం ఒక్క శాశ్వత భవనాన్ని కట్టారా
* చట్ట సభలను అడ్డుకుని అలజడులు సృష్టించడమే చంద్రబాబు విజనా
* అమరాతి రాజధాని కావాలంటే టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
* చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడా, పనికిమాలిన నాయకుడు
* జగన్ దెబ్బకు చంద్రబాబు జోలె పట్టుకున్నారు