చంద్రబాబుని తరిమికొట్టిన ప్రజలు, రోజా కామెంట్స్

చంద్రబాబుని తరిమికొట్టిన ప్రజలు, రోజా కామెంట్స్

Updated On : February 18, 2021 / 12:53 PM IST

mla roja fires on chandrababu naidu: టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఫ్రైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా పైర్ అయ్యారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు కుప్పం ప్రజలు కూడా విసిగిపోయారని, అందుకే ఆయనను కుప్పం నుంచి తరిమికొట్టారని రోజా అన్నారు. మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో అత్యధిక స్థానాల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారని రోజా తెలిపారు. సీఎం జగన్ ఏం పీకారని చంద్రబాబు విమర్శించారన్న రోజా, ఈ రోజు కుప్పం నుంచి చంద్రబాబుని జగన్ పీకిపారేశారని చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబు తన పెద్దరికాన్ని కాపాడుకుంటే మంచిదని హితవు చెప్పారు రోజా. జగన్ సుపరిపాలన అందిస్తున్నారని, ఆ పాలన ప్రజలక హృదయాలకు ఎంతగా హత్తుకుపోయిందో అర్థం చేసుకోవచ్చన్నారు రోజా.