తిరుమల లడ్డూ వివాదం.. కల్తీ నెయ్యి వెనుక భారీ కుట్ర..!
వెంకన్న లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని కూటమి నేతలు తేల్చి చెబుతున్నారు.

Ttd Laddu Row : తిరుమల లడ్డూ వివాదం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ఇష్యూపై అధికార పక్షం తీవ్రంగా రియాక్ట్ అవుతోంది. భక్తుల మనోభావాలను గత వైసీపీ సర్కార్ దెబ్బతీసిందని అధికార పక్ష ఎమ్మెల్యేలు, మంత్రులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు కల్తీ నెయ్యి వెనుక భారీ కుట్ర ఉందని సంచలన ఆరోపణలు గుప్పించారు. వెంకన్న లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని కూటమి నేతలు తేల్చి చెబుతున్నారు.
వేంకటేశ్వర స్వామి కైంకర్యాల్లో వాడే పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేశారని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. జంతువు కొవ్వుని వాడారని ల్యాబ్ రిపోర్టులు వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి అపవిత్ర కార్యక్రమం యావత్ ప్రపంచాన్ని కలచివేస్తోంది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో టీటీడీ ఛైర్మన్ గా పెట్టిన వ్యక్తి కక్కుర్తి పడ్డారని, తిరుపతి లడ్డూని అపవిత్రం చేశారని మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు.
Also Read : వలస నేతలంతా చలో జనసేన అనటానికి కారణమేంటి? చేరికలపై పవన్ కల్యాణ్ వైఖరేంటి?
వైఎస్ జగన్ కనుసన్నల్లోనే ఈ అపవిత్రం జరిగిందని ఎమ్మెల్యే పులివర్తి నాని ఆరోపించారు. సుప్రభాతం మొదలుకుని ఏకాంత సేవ వరకు ఏం చేయాలి.. స్వామి వారి ప్రసాదం మొదలుకుని నైవేద్యం వరకు ఏం చేయాలి, ఏ దిట్టం వాడాలి అన్నది ఆగమాల్లో స్పష్టంగా ఉందని ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు. అయితే, జగన్ వాటన్నింటిని తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు.