MLC Varudu Kalyani: ముడుపుల కోసం పోలవరాన్ని నాశనం చేసిన చంద్రబాబు: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
ఏపీకి పెట్టిన దరిద్రం చంద్రబాబు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

MLC Varudu Kalyani
MLC Varudu Kalyani : టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని విమర్శించారు. చంద్రబాబు తన పాలనలో టిడ్కో ఇళ్ళు పూర్తి కాలేదన్నారు. తాము లక్షా ముప్పై వేల టిడ్కో ఇళ్ళను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జగన్ కట్టిస్తున్న ఇళ్ల లబ్ధిదారులకు దగ్గరకు వెళ్ళి సెల్ఫీ దిగండని చంద్రబాబుకు సూచించారు.
ముడుపుల కోసం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని మండిపడ్డారు. ఏపీకి పెట్టిన దరిద్రం చంద్రబాబు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సెల్ఫీ చంద్రబాబు నాయుడు సచివాలయం ఉద్యోగులతో సెల్ఫీ దిగండి అని అన్నారు. మోసాలకు అలవాటు పడ్డ టీడీపీ నాయకులు ఇంకా మోసాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
Minister Roja: చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్
వంగలపూడి అనితకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని తెలిపారు. ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్తే నిజమని జనం నమ్ముతారన్న భ్రమలో చంద్రబాబు నాయుడు ఉన్నారని వెల్లడించారు. ప్రతి ఇంట్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి తనదైన ముద్ర వేసుకున్నారని తెలిపారు. దిశ ద్వారా మహిళలకు భద్రత కలిగిందని పేర్కొన్నారు. అరవై రోజుల్లో నిందితులకు శిక్ష పడిందని చెప్పారు.