బీజేపీలో చేరుతారా..? : ప్రధాని మోడీని కలిసిన మోహన్ బాబు

సినీ నటుడు మోహన్ బాబు ప్రధాని మోడీని కలిశారు. సోమవారం(జనవరి 6,2020) ప్రధానిని కలిశారు. అరగంటకు పైగా ప్రధానితో చర్చలు జరిపారు. మోహన్ బాబుతో పాటు కొడుకు

  • Published By: veegamteam ,Published On : January 6, 2020 / 07:50 AM IST
బీజేపీలో చేరుతారా..? : ప్రధాని మోడీని కలిసిన మోహన్ బాబు

Updated On : January 6, 2020 / 7:50 AM IST

సినీ నటుడు మోహన్ బాబు ప్రధాని మోడీని కలిశారు. సోమవారం(జనవరి 6,2020) ప్రధానిని కలిశారు. అరగంటకు పైగా ప్రధానితో చర్చలు జరిపారు. మోహన్ బాబుతో పాటు కొడుకు

సినీ నటుడు మోహన్ బాబు ప్రధాని మోడీని కలిశారు. సోమవారం(జనవరి 6,2020) ప్రధానిని కలిశారు. అరగంటకు పైగా ప్రధానితో చర్చలు జరిపారు. మోహన్ బాబుతో పాటు కొడుకు విష్ణు, కోడలు వెరోనికా, కూతురు లక్ష్మీ ప్రసన్న కూడా ప్రధానిని కలిశారు. 2019 ఎన్నికలకు ముందు మోహన్‌బాబు వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరుఫున విసృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.

జగన్ అధికారంలోకి వచ్చాక ఆయనకు రకరకాల పదవులు ఇస్తున్నారని వార్తలు వినిపించాయి. కానీ వాటన్నింటిని ఎప్పటికప్పుడు మోహన్ బాబు తోసిపుచ్చారు. తాజాగా మోహన్‌బాబు ప్రధాని మోడీని కలవడం ఏపీ రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. మోడీని ఎందుకు కలిశారు? ఏం మాట్లాడారు అనేది ఆసక్తికరంగా మారింది. మోడీతో భేటీ తర్వాత.. మోహన్ బాబు బీజేపీలో చేరతారనే ప్రచారం మొదలైంది. డైనమిక్, గౌరవనీయులు ప్రధాని మోడీని ఇప్పుడే కలిశాము అని మంచు లక్ష్మీ ట్వీట్ చేశారు. గొప్ప విజన్ ఉన్న నేత మోడీ అని ప్రశంసించింది.