ఏపీలో 8 లక్షలకుపైగా కోలుకున్న కరోనా బాధితులు

  • Published By: bheemraj ,Published On : November 4, 2020 / 01:06 AM IST
ఏపీలో 8 లక్షలకుపైగా కోలుకున్న కరోనా బాధితులు

Updated On : November 4, 2020 / 6:28 AM IST

corona victims recover : ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 8 లక్షలు దాటింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 84,534 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,849 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 15 మంది మృతి చెందారు.



ఏపీలో ఇప్పటివరకు మొత్తం 8,30,731 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మొత్తం 6,734 మంది చనిపోయారు. గత 24 గంటల్లో 3700 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు.



ప్రస్తుతం ఏపీలో 21,672 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 82,66,800 కరోనా శాంపిల్స్ ను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ లో వెల్లడించింది.