అత్యంత ధనవంతుడు బాబు : రూ. 186 కోట్లు – వరప్రసాద్

భారతదేశంలో అత్యంత ధనవంతుడు చంద్రబాబు నాయుడు అని ఎన్నికల కమిషన్ చెప్పిందని, తనకు తెలిసిన వివరాల ప్రకారం..రూ. 186 కోట్లు బాబుకు ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. ప్రజలు అవకాశం ఇచ్చినా టీడీపీ నిలబెట్టుకోలేకపోయిందన్నారు. బాబు అసమర్థుడు, అహంకారి అని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందని, కానీ బాబు ఏమీ నేర్చుకోవడం లేదన్నారు.
2020, జనవరి 23వ తేదీ గురువారం నాలుగో రోజు జరిగిన సమావేశాల్లో ఇంగ్లీషు మీడియంతో పాటు ఇతర అంశాలపై చర్చ జరిగింది. ఎడ్యుకేషన్ యాక్టు సవరణ బిల్లును ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. మండలిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు కీలకంగా మారాయి. ఈ చర్చల్లో వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు.
బీసీలు, దళితులపై గతంలో బాబు మాట్లాడిన విషయాలను ఆయన గుర్తు చేశారు. ఆయన గోతి ఆయనే తవ్వుకున్నారని విమర్శించారు. తాను కూడా గతంలో కలెక్టర్‌గా చేయడం జరిగిందని సభకు తెలిపారు. బాబుకు ఏ మాత్రం ధైర్యం లేదన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయవద్దన్నారు. కరుణానిధి సెక్రటేరియట్ కట్టారని, జయలలిత వచ్చిన తర్వాత దానిని జనరల్ ఆస్పత్రిగా మార్చారని తెలిపారు. మరలా కరుణానిధి వచ్చిన తర్వాత ఈ విధంగా చేయలేదని తెలిపారు.
ఇంగ్లీషు మీడియం కంపల్సరి : –
తరతరాలు అభివృద్ధి చెందాలంటే..ఆరోగ్యం, విద్య చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం పోటీతత్వం పెరిగిపోయిందని, అందులో ఇంగ్లీషు ప్రపంచ భాషగా మారిందన్నారు. చట్టంలో ఇంగ్లీషు భాషను చిన్న వయస్సులో నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను కంపల్సరీ పెట్టడాన్ని హర్షించదగిన విషయమన్నారు. చదువుకోని తల్లిదండ్రులు అయితే..ఉపాధ్యాయులు నిర్ణయిస్తారని, విద్యార్థులకు భవిష్యత్ బాగుంటుందన్నారు.
విద్యపై సీఎం జగన్ ఫోకస్ పెడుతున్నారని, అమ్మఒడి పథకం వల్ల కుటుంబాలు బాగు పడుతాయన్నారు. దరిద్రరేఖ కింద 40 శాతం ఉన్నారని, 80 నుంచి 90 శాతం వరకు వెనుకబడిన వర్గాల వారు ఉన్నారని సభకు తెలిపారు. ఆర్థిక శాస్త్రవేత్తలకు కూడా, అనుభవం ఉన్న రాజకీయ నేతలకు కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు సీఎం జగన్‌కు వస్తున్నాయన్నారు.
Read More : బాలయ్యతో రోజా సెల్ఫీ: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ సీరియస్