YS Viveka Case : అరెస్ట్ భయం .. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు అవినాశ్ రెడ్డి .. అయినా దక్కని ఊరట

వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డికి అరెస్ట్ తిప్పలు తప్పటంలేదు. ఎప్పుడు సీబీఐ అరెస్ట్ చేస్తుందోననే ఆందోళనతో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించినా మరోసారి ఫలితం దక్కలేదు.తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపి నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరినా సుప్రీంకోర్టు క్లారిటీ ఇవ్వకపోవటంతో ఇక అవినాశ్ అరెస్ట్ ఆందోళనలో పడ్డారు.

YS Viveka Case : అరెస్ట్ భయం .. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు అవినాశ్ రెడ్డి .. అయినా దక్కని ఊరట

YS Viveka Case.. MP Avinash Reddy

Updated On : May 17, 2023 / 12:45 PM IST

YS Avinash Reddy : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడుగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ భయంతో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ (తాత్కాలిక బెంచ్) తన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపి నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. కానీ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణ ఎప్పుడు చేస్తామనే విషయాన్ని సుప్రీంకోర్టు ఖరారు చేయలేదు. దీంతో అరెస్ట్ చేస్తారనే ఆందోళనకు అవినాశ్ రెడ్డికి ఊరట లభించలేదు. కానీ విచారణ అత్యవసరం అయితే రాతపూర్వకంగా అభ్యర్థన ఇవ్వాలని సూచించింది. పిటీషన్ లో ఉండే అవసరాన్ని బట్టి తాము నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. దీంతో అవినాశ్ కు అరెస్ట్ ఆందోళన కొనసాగుతునే ఉందని చెప్పాలి.

తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ (తాత్కాలిక బెంచ్) తన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపి నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అవినాశ్ పిటీషన్ పై విచారణ వేసవి సెలవుల్లో వెకేషన్ బెంచ్ ముందు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు పిటీషన్ వేయాలా?వద్దా? అనే విషయాన్ని సీజేఐ ధర్మాసనం తేల్చనుంది. మెన్షనింగ్ లిస్టును వినకుండానే బ్యాచ్ ల వారీగా తేదీలను కేటాయిస్తామని సీజేఐ వెల్లడించారు. దీంతో అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టులో  ఊర‌ట‌ ద‌క్క‌నేలేదు.

సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి,అతని తండ్రి భాస్కర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి వంటి పలువురిని నిందితులుగా చేర్చిన సీబీఐ.. వారిలో ఆరుగురిని అరెస్టు చేసింది. కీలక నిందితుల్లో కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఉన్నారు.భాస్కర్ రెడ్డితో పాటు ఉదయ్ భాస్కర్ రెడ్డి చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఈ కేసులో ఏ1 నిందితుడు ఎర్రగంగిరెడ్డికూడా కోర్టులో  లొంగిపోయారు. ఇక ఈకేసులో కీలక నిందితుడు అని సీబీఐ పేర్కొటున్న ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ పై ఉత్కంఠ కొనసాగుతునే ఉంది. రేపో మాపో అరెస్టు చేసేందుకు సిద్దమవుతోంది. దీంతో అరెస్ట్ భయంతో అవినాశ్ ఏకంగా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం ఊరట లభించలేదు.

తెలంగాణ హైకోర్టులో తాను దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేయటంతో ఓ వైపు సీబీఐ దూకుడుతో అరెస్ట్ భయం పట్టుకున్న అవినాష్ రెడ్డి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ కేసులో తనను సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా అవినాష్ కు ఊరట దక్కలేదు. దీంతో ఇక తెలంగాణ హైకోర్టు ఆదేశాలే కీలకంగా మారాయి. అయితే వేసవి సెలవులకు ముందు ఈ వ్యవహారం తేల్చేందుకు తెలంగాణ హైకోర్టు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.