Galla Jayadev Demand BharatRatna : ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి- పార్లమెంటులో ఎంపీ డిమాండ్
రాజకీయాల్లో సత్తా చాటిన ఎన్టీఆర్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని ఎంపీ గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు.(Galla Jayadev Demand BharatRatna)

Galla Jayadev Demand Bharat Ratna
Galla Jayadev Demand BharatRatna : నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలైంది. ఉభయ రాష్ట్రాల్లో 40 వసంతాల వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. టీడీపీ 40 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని టీడీపీ నేత, లోక్ సభ ఎంపీ గల్లా జయదేవ్.. పార్లమెంటులో టీడీపీ పేరుతో పాటు ఎన్టీఆర్ పేరును కూడా ప్రస్తావించారు.
ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో సత్తా చాటిన ఎన్టీఆర్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని చాలాకాలం నుంచి టీడీపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ 40 వసంతాల వేళ కూడా ఆ పార్టీ ఎంపీగా గల్లా జయదేవ్ అదే డిమాండ్‌ను మరోమారు ప్రస్తావించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్ సభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన గల్లా జయదేవ్.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో టీడీపీ 40 వసంతాల పండుగ జరుపుకుంటున్న విషయాన్ని ఆయన పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లారు.(Galla Jayadev Demand BharatRatna)
TDP @ 40 Years : టీడీపీ ఆవిర్భావానికి ముందు, తర్వాత అని చరిత్ర చదవాలి-చంద్రబాబు నాయుడు
తెలుగు ప్రజల ఆత్మ గౌరవం నినాదంతో తెలుగు దేశం పార్టీ పేరిట ఓ రాజకీయ పార్టీని ప్రారంభించి జాతీయ రాజకీయాల్లో సైతం సత్తా చాటిన నేతగా దివంగత ఎన్టీఆర్‌కు ట్రాక్ రికార్డు ఉంది. పార్టీ ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన అరుదైన రికార్డు కూడా ఎన్టీఆర్ సొంతమే. ఎన్టీఆర్ చేతుల్లో పురుడు పోసుకున్న టీడీపీకి నేటితో 40 ఏళ్లు నిండాయి.
Sajjala Ramakrishna Reddy: ప్రస్తుతం తెలుగుదేశం అవసాన దశలో ఉంది: సజ్జల రామకృష్ణ రెడ్డి
టీడీపీని ఎన్టీఆర్ స్థాపించిన ముహూర్త బలం చాలా గొప్పదని, అందుకే ఎన్ని ఆటంకాలెదురైనా తట్టుకుంటోందని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీని ఎంతోమంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టినా అంతకన్నా ఉత్సాహంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. టీడీపీకి ముందు.. ఆ తర్వాత అనేలా తెలుగు చరిత్రను చదువుకోవాల్సిందేనన్నారు. పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ఎన్నారై విభాగం 40 దేశాల్లోని 200 నగరాల్లో నిర్వహిస్తున్న వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నారైలు ఎక్కడున్నా రాష్ట్ర భవిష్యత్ కు అండగా నిలబడాలని, తోడ్పాటును అందించాలని చంద్రబాబు కోరారు.
Telugu Desam Party : టీడీపీ 40 ఏళ్ల వ్యవస్ధాపక దినోత్సవం
తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ఈ పార్టీని స్థాపించారని, ప్రజల సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆరేనని చంద్రబాబు అన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో అమలవుతున్న ఆహార భద్రత పథకాన్ని.. రూ.2కే కిలో బియ్యం పథకం పేరిట ఎప్పుడో ఎన్టీఆర్ అమలు చేశారని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలు, ఆలోచనలకు తగ్గట్టుగా పార్టీని బలోపేతం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Minister Kodali Nani : ఎన్టీఆర్ పేరుతో చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నారు : మంత్రి కొడాలి నాని