Sajjala Ramakrishna Reddy: ప్రస్తుతం తెలుగుదేశం అవసాన దశలో ఉంది: సజ్జల రామకృష్ణ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అవసాన దశలో వెంటిలేటర్ పై ఉందని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు

Sajjala Ramakrishna Reddy: ప్రస్తుతం తెలుగుదేశం అవసాన దశలో ఉంది: సజ్జల రామకృష్ణ రెడ్డి

Sajjala

Updated On : March 29, 2022 / 3:38 PM IST

Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అవసాన దశలో వెంటిలేటర్ పై ఉందని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి అన్నారు. తెలుగు దేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ “టీడీపీ ఆవిర్భవించి నలబై ఏళ్ళు అయింది అంటూ సంబరాలు చేస్తున్నారు..కుట్రలు, మేనేజ్మెంట్ లో చంద్రబాబుకి డాక్టరేట్ ఇవొచ్చు” అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Also read:G.Kishan reddy: తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన రాజకీయాలు నడుస్తున్నాయి: కిషన్ రెడ్డి

ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి అంశాలు గుర్తుచేసుకొని చ్ఛంద్రబాబు ప్రస్తుతం ప్రజల నుంచి సానుభూతి పొందాలని చూస్తున్నారని సజ్జల అన్నారు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాంవేశాలకు ఎందుకు రాలేదని.. అసెంబ్లీకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై ఎందుకు చర్చ జరగనివ్వలేదని సజ్జల ప్రశ్నించారు. ఎన్టీఆర్ ప్రారంభించిన టీడీపీని చంద్రబాబు కాలగర్భంలో కలిపే పరిస్థితికి తెచ్చారని సజ్జల అన్నారు. 98 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పు చంద్రబాబు అధికారంలో ఉండగా నాలుగు లక్షల కోట్లు అయిందని మండిపడ్డారు. కోవిడ్ వల్ల రాష్ట్రంలో ఆర్ధిక కష్టాలు వున్నా..సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని సజ్జల పేర్కొన్నారు.

Also read:TRS-Congress : టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య ధాన్యం వార్‌.. కవిత ట్వీట్‌కు మాణిక్కం ఠాగూర్‌, ఎంపీ కోమటిరెడ్డి కౌంటర్‌