Nara Lokesh : చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయటం జగన్ చేసిన అతి పెద్ద తప్పు, వైసీపీ ఫ్యాన్ ఆగిపోవడం ఖాయం : లోకేశ్

మరో మూడు నెలల్లో వైసీపీ ఫ్యాన్ ఆగిపోవటం ఖాయం.. మా ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయం అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ధీమా వ్యక్తంచేశారు.

Nara Lokesh : చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయటం జగన్ చేసిన అతి పెద్ద తప్పు, వైసీపీ ఫ్యాన్ ఆగిపోవడం ఖాయం  : లోకేశ్

Nara Lokesh At Mummidivaram

Nara Lokesh At Mummidivaram Yuvagalam : మరో మూడు నెలల్లో వైసీపీ ఫ్యాన్ ఆగిపోవటం ఖాయం.. మా ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయం అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ధీమా వ్యక్తంచేశారు. చంద్రబాబు అరెస్ట్ తో ఆగిపోయిన యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించిన లోకేశ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడవరంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో  చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేయడం జగన్ చేసిన అతి పెద్ద తప్పు అంటూ విరుచుకుపడ్డారు.చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆయన గొప్ప తనం అన్ని వర్గాల ప్రజలకు అర్థమైందనీ..నిజమే గెలిచిందన్నారు. చంద్రబాబు నాయుడు నిప్పులా బయటకు వచ్చారని అన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ పై సెటైర్లు వేశారు. జగన్ కు ఒక వ్యాధి ఉంది…అతనికి ఆత్మలతో మాట్లాడే జబ్బు ఉంది అంటూ ఎద్దేవా చేశారు.ఈ సభ ముఖంగా పవన్ కళ్యాణ్ అన్న కి కృతజ్ఞతలు చెప్పారు.చిత్తు చిత్తు గా జగన్ ఓడించి, జగన్ ఈ రాష్ట్రం నుండి పారిపోయే వరుకు నేను నిద్రపోను అని అన్నారు..జగన్ దెబ్బకు అధికారులు ఢిల్లీ వెళ్లిపోయేందుకు దరఖాస్తులు కూడా పెట్టుకున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.జగన్ కి ఉపాద్యాయులు అంటే కోపం..వారిని మద్యం దుకాణాల దగ్గర కాపలా పెట్టారు అంటూ విమర్శించారు. మా ప్రభుత్వం వచ్చాక ఉపాద్యాయులను ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

నారా లోకేష్ యువగళం పాదయాత్ర 212వ రోజు ప్రారంభం

సైకో జగన్ ప్రజల రక్తం త్రాగుతున్నారు అంటూ మండిపడ్డారు.జగన్ ప్రభుత్వం అమ్మే మద్యాన్ని పరీక్షల కోసం పంపితే పొలంలో పురుగుల మందు బదులు ఈ మద్యం పిచికారీ చేస్తే పురుగులు చనిపోతాయని చెప్పారు అంటూ విమర్శించారు.రాష్ట్రంలో సైలెంట్ యుద్ధం జరుగుతోందని…పేదలకు పెత్తందారుడు జగన్ కి మధ్య జరగుతున్న యుద్ధం జరుగుతోందన్నారు.చంద్రబాబు నాయుడు టిడ్కో ఇల్లు కడితే ఆ ఇళ్లు పేద వాళ్లుకు ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. తమ మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి సవంత్సరం జాబ్ క్యాలెండర్ వేసే భాధ్యత తాను తీసుకుంటానని భరోసా ఇచ్చారు.

రైతన్నలను ఆదుకోవడానికి రైతన్న సుఖీభవ పథకం ద్వారా ప్రతి ఏటా రూ.25 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు.బీసీల కోసం ప్రత్యేక మైన రక్షణ చట్టం తీసుకుని వస్తామన్నారు.మైనార్టీ సోదరుల కోసం ఇస్లామిక్ బ్యాంక్ తీసుకుని వస్తానని హామీ ఇచ్చారు.ఉద్యోగలకు, పెన్షన్ దారులకు సరైన సమయంలో జీతాలు అందిస్తామని..పోలీసులు కోసం జీ వో నెంబర్ 79 రద్దు చేస్తామని తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ పేరు కలెక్షన్ కుమార్ అని పిలవాలి అంటూ ఎద్దేవా చేశారు.నాలుగు సవంత్సరల నుండి ఎమ్మెల్యే సతీష్ కుమార్ నాలుగు వందల కోట్లు సంపాదించారని..మత్స్యకారుడై ఉండి మత్స్యకారుల సొమ్ము దోచేశారని ఆరోపించారు.ఏనాడైనా శాసన సభలో మీ నియోజక వర్గం కోసం ..మీ ఎమ్మెల్యే మాట్లాడిన సందర్భం ఉందా..? అని సభలో ప్రశ్నించారు.