మంత్రిగా 2019లో పనిని ఎక్కడ ఆపానో అక్కడి నుండే తిరిగి ప్రారంభిస్తా: నారా లోకేశ్

Nara Lokesh: అప్పట్లో పల్లె సేవే పరమాత్ముడి సేవ అని భావించి తాను పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చానని..

మంత్రిగా 2019లో పనిని ఎక్కడ ఆపానో అక్కడి నుండే తిరిగి ప్రారంభిస్తా: నారా లోకేశ్

Nara Lokesh

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ మంత్రిగా 2019లో పనిని ఎక్కడ ఆపానో అక్కడి నుండే తిరిగి ప్రారంభిస్తానని నారా లోకేశ్ అన్నారు. ఐటీ ఎలక్ట్రానిక్ కంపెనీలను ఆకర్షిస్తామని చెప్పారు. ఏపీ నుంచి వలస వెళ్లకుేండా మన యువతకు ఉద్యోగాలు కల్పించడానికి కృషి చేస్తానని తెలిపారు.

అమరావతిలో నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నెరవేర్చడానికి తమ ముందు ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటానని తెలిపారు. ఇక ఏపీ ఉద్యోగాల కల్పనలో ఇతర రాష్ట్రాలకు తీవ్రమైన పోటీ ఇస్తుందని అన్నారు.

తన మీద నమ్మకం ఉంచి తనకు ఆయా శాఖలు కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. ఏపీ యువతకు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల్లో ఉద్యోగాల నైపుణ్యం కల్పించడానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తానని నారా లోకేశ్ తెలిపారు.

Also Read: మిత్రపక్షాలకు కీలక శాఖలు కేటాయించిన చంద్రబాబు.. ఏయే మంత్రి పదవులో తెలుసా?

అప్పట్లో పల్లె సేవే పరమాత్ముడి సేవ అని భావించి తాను పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చానని నారా లోకేశ్ అన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా అనేక కంపెనీలను ఏపీకి తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించానని తెలిపారు. అప్పుడు పనిచేసిన అనుభవంతో ఇప్పుడు మరింత సమర్థవంతంగా పనిచేస్తానని అన్నారు.