మిత్రపక్షాలకు కీలక శాఖలు కేటాయించిన చంద్రబాబు.. ఏయే మంత్రి పదవులో తెలుసా?

Chandrababu Naidu: కీలకమైన వైద్యారోగ్య శాఖను బీజేపీకి కేటాయించారు.

మిత్రపక్షాలకు కీలక శాఖలు కేటాయించిన చంద్రబాబు.. ఏయే మంత్రి పదవులో తెలుసా?

Chandrababu Naidu

Updated On : June 14, 2024 / 5:54 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ మిత్రపక్షాలకు కీలక శాఖలు కేటాయించారు. ఇవాళ ఏపీ మంత్రులకు శాఖలు కేటాయించిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం హెూదాను ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే ఆయన పరిమితం చేశారు.

క్యాబినెట్‌లోకి పవన్ కల్యాణ్ రావడంతో ఆయన ఒక్కరికే డిప్యూటీ సీఎం పదవిచ్చి గౌరవించారు. 2014-19 మధ్య కాలంలో టీడీపీ అధికారంలో ఉంది. ఆ సమయంలో ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులిచ్చారు చంద్రబాబు. అలాగే, అనంతరం 2019-2024 మధ్య కాలంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులిచ్చారు జగన్.

అలాగే, పౌర సరఫరాలు వంటి కీలక శాఖను జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు చంద్రబాబు నాయుడు కేటాయించారు. చంద్రబాబుకు ఇష్టమైన టూరిజం శాఖను కూడా జనసేనకే ఇచ్చారు. కీలకమైన వైద్యారోగ్య శాఖను బీజేపీకి కేటాయించారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి అభినందనలు అంటూ చంద్రబాబు ట్వీట్