ఏపీలో 24గంటల్లో కొత్తగా 118 కరోనా కేసులు

ఏపీలో గత 24 గంటల్లో 45,079 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 118మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. ఎలాంటి మరణాలు సంభవించలేదు.

ఏపీలో 24గంటల్లో కొత్తగా 118 కరోనా కేసులు

Updated On : March 9, 2021 / 4:42 PM IST

118 Covid-19 Positive cases in AP : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా కొత్త పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్‌ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 45,079 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 118మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. ఎలాంటి మరణాలు సంభవించలేదు.

గడిచిన 24 గంటల్లో 89మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకూ 1,43,07,165 మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించారు.

ఏపీలో ఇప్పటివరకూ 8,90,884కు కరోనా కేసులు చేరగా, 7,176 మంది కరోనాతో మృతిచెందారు. ఏపీలో 1038 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. 8,82,670 మంది డిశ్చార్జ్ అయ్యారు.