ఏపీలో కొత్త పథకాలు : జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన

ఏపీలో కొత్త పథకాలు : జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన

Ys Jagan

Updated On : May 18, 2021 / 12:03 PM IST

ఏపీలో మరో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం పతొక్క హామీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడిస్తున్నారు. తాజాగా మరో రెండు కొత్త పథకాలను ప్రకటించారు సీఎం జగన్. 2020, జనవరి 09వ తేదీ గురువారం చిత్తూరు జిల్లాలో అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…విద్యార్థుల కష్టాలు తీర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేయడం జరుగుతోందని, అందులో భాగంగా రెండు కొత్త పథకాలు ‘జగనన్న విద్యా దీవెన’, ‘జగనన్న వసతి దీవెన’ పథకాలు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

ఇంటర్ మీడియట్ అయిపోయిన తర్వాత…హయ్యర్ స్టడీ చేస్తున్న వారు కేవలం 23 శాతమే ఉన్నారని, 77 శాతం మంది పిల్లలు చదువల జోలికి వెళ్లడం లేదని వివరించారు. చదువులు భారమై..చదివించలేని పరిస్థితి తల్లిదండ్రులకు వచ్చిందని, స్టడీ చేదామని అనుకున్నా అలాంటి పరిస్థితి లేదని సభలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, పేదరికంలో ఉన్న మైనార్టీలు, అగ్రవర్ణ పేదలున్నారని, వీరి జీవితాలను బాగు పరిచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ‘జగనన్న విద్యా దీవెన’ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌ చేస్తామన్నారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తోడుగా ఉంటామని ప్రకటించారు.

‘జగన్నన్న వసతి దీవెన’ కింద హాస్టల్, భోజనం ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తుందన్నారు. ప్రతి పిల్లాడికి రూ. 20 వేలు నేరుగా వారి వారి అకౌంట్లలో
జనవరి, ఫిబ్రవరి నెలలో సగం రూ. 10 వేలు, జూన్, ఆగస్టు నెలలో రూ. 10 వేలు..మొత్తం రూ. 20 వేలు తల్లిదండ్రుల అకౌంట్లో వేయడం జరుగుతుందన్నారు సీఎం జగన్.

* పిల్లల్ని బడికి పంపే తల్లులకు ప్రభుత్వం కానుక.
* ఒకటి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు వర్తింపు.
* నేరుగా తల్లులకు నగదు బదిలీ.
* ఇంటర్ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు వర్తింపు.

* ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు వర్తింపు.
* ఒకటో తరగతి నుంచి ఇంటర్ మీడియట్ విద్యార్థుల తల్లి అకౌంట్‌లో రూ. 15 వేలు.
* 42 లక్షల 12 వేల మంది లబ్దిదారుల అకౌంట్లలో రూ. 6 వేల 318 కోట్లు జమ.
* ఈ ఏడాది 75 శాతం హాజరు లేకపోయినా పథకం వర్తింపు.

* వచ్చే సంవత్సరం 75 శాతం హాజరు తప్పనిసరి.
* పిల్లల బంగారు భవిష్యత్ కోసమే ఇంగ్లీషు మీడియం.
* జూన్ నుంచి అన్ని ప్రభుత్వ స్కూళ్లలో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం బోధన.
* ఆ తరువాత ఒక్కో ఏడాది ఒక్కో తరగతి చొప్పున ఇంగ్లీషు మీడియం అమలు.

Read More : రోజుకో రుచి : విద్యార్థులకు జగన్ మార్క్ మెనూ