నాకు బూతులు రావు : నో క్వశ్చన్ అంటే తిట్టినట్లా? – బాబు

  • Published By: madhu ,Published On : December 13, 2019 / 08:11 AM IST
నాకు బూతులు రావు : నో క్వశ్చన్ అంటే తిట్టినట్లా? – బాబు

Updated On : December 13, 2019 / 8:11 AM IST

నో క్వశ్చన్ అనే పదాన్ని బాస్టర్డ్ అనే విధంగా చిత్రీకరించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. తన నోటి నుంచి ఎప్పుడూ బూతులు రావన్నారు. మార్షల్స్ వద్ద తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, మూడు గంటల పాటు తాను అనని దాన్ని అన్నట్లు చూపించారని ఆరోపించారు.

2019, డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం కొనసాగిన ఏపీ శీతాకాల అసెంబ్లీలో మార్సల్స్ వద్ద టీడీపీ నేతలు చేసిన వ్యవహరం దుమారం రేపింది. బాబు క్షమాపణలు చెప్పాల్సిందేనని, టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని అధికారపక్షం డిమాండ్ చేసింది.
 

దీనిపై బాబు మాట్లాడుతూ…
ఎప్పుడైనా కోపం వస్తే..గట్టిగా మాట్లాడుతానని, సీఎం దగ్గరుండి సభను తప్పుదోవ పట్టించడంపై ప్రివిలేజ్ మోషన్ వేస్తామన్నారు బాబు. 
తనకు అవమానం జరిగితే..ఎవరూ మాట్లాడడం లేదు. 
సభలో చర్చించకుండా..కావాలని రాద్ధాంతం చేస్తున్నారు. 
తన రాజకీయ జీవితంలో ఎన్నడూ అన్ పార్లమెంటరీ భాష వాడలేదు. 
అచ్చెన్నాయుడిని టార్గెట్ చేశారు..ఇప్పుడు తనను టార్గెట్ చేశారు. 
అసెంబ్లీలో మాట్లాడనీయడం లేదు. అందుకే నిరసన వ్యక్తం చేస్తున్నాం.
అధికారపక్షం కుట్ర రాజకీయాలు చేస్తోంది. 
వీడియోలో ఎవరి తప్పో తెలుస్తుంది. 
సో..ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సినవసరం లేదు. 
Read More : అసెంబ్లీ సమరం : బాబు సారీ చెబుతారా ? సస్పెండ్ చేస్తారా