NTR Vaidya Seva: ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్..! ఎప్పటి నుంచి, ఎందుకు అంటే..

ఇందుకు నిరసనగా ఎన్టీఆర్ వైద్యలు బంద్ చేయాలని నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

NTR Vaidya Seva: ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్..! ఎప్పటి నుంచి, ఎందుకు అంటే..

Updated On : September 24, 2025 / 5:02 PM IST

NTR Vaidya Seva: ఏపీలో నెట్‌వర్క్‌ ఆసుపత్రుల అసోసియేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ చేయాలని డిసైడ్ అయ్యింది. అక్టోబర్‌ 10వ తేదీ నుంచి రాష్ట్రంలో ఎన్టీఆర్‌ వైద్య సేవలు నిరవధికంగా బంద్‌ చేయనున్నట్లు నెట్ వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ వెల్లడించింది. బిల్లుల చెల్లింపులో వైద్య ఆరోగ్యశాఖ తీరుపై నెట్ వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పెండింగ్‌ బిల్లులు చెల్లించకుండా కొత్త విధానంవైపు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు నిరసనగా ఎన్టీఆర్ వైద్యలు బంద్ చేయాలని నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.