Tirupati Murder : తిరుపతిలో వృద్ధుడి దారుణ హత్య

తిరుపతిలో ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు.. చెత్తకాగితాలు ఏరుకొని జీవనం సాగించే ఆర్ముగం రాత్రి రోడ్డుపక్కనే ఫుట్ పాత్‌పై నిద్రిస్తాడు. రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు

Tirupati Murder : తిరుపతిలో వృద్ధుడి దారుణ హత్య

Tirupati Murder

Updated On : December 22, 2021 / 1:39 PM IST

Tirupati Murder : తిరుపతిలో ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు.. చెత్తకాగితాలు ఏరుకొని జీవనం సాగించే ఆర్ముగం (68) రాత్రి రోడ్డుపక్కనే ఫుట్ పాత్‌పై నిద్రిస్తాడు. అయితే మంగళవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హతమార్చారు. ఉదయం వృద్ధుడు మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

చదవండి : Tirupati : తిరుపతిలో విశాఖ యాత్రికుడు ఆత్మహత్యాయత్నం

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తలపై బలమైన గాయాలు ఉండటంతో హత్యగా నిర్దారించారు.. అనంతరం మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డాగ్‌స్వాడ్ సాయంతో ఘటన స్థలిని క్షున్నంగా పరిశీలిస్తున్నారు. అయితే వృద్ధుడి మృతదేహానికి సమీపంలోని పలు వాహనాల అద్దాలు పగిలి ఉండటం అనుమానాలకు తావిస్తుంది. ఎవరైనా సైకో ఈ పని చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సీసీ సమీపంలోని సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

చదవండి : Flexi In Tirupati : తిరుపతిలో ఫ్లెక్సీల కలకలం….అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్న మార్గంలోనే